ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే

Updated on: Mar 08, 2026 | 5:28 PM

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత్-అమెరికా విమాన సర్వీసులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా కీలక గగనతలాలు మూసివేయడంతో, విమానయాన సంస్థలు రూట్లను మళ్లిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరిగి, చివరికి విమాన టికెట్ల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. ప్రవాస భారతీయులపై ఈ భారం ఎక్కువగా పడుతోంది.

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు అంతర్జాతీయ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన గగనతల మార్గాలను మూసివేయడంతో, భారత్-అమెరికా మధ్య నడిచే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు తమ రూట్లను మళ్లిస్తుండటంతో ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, టికెట్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. గూగుల్ ఫ్లైట్స్ తాజా గణాంకాల ప్రకారం, అమెరికాలోని ప్రధాన నగరాల నుంచి భారత్‌కు వచ్చే విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. న్యూయార్క్ – ఢిల్లీ టికెట్‌ ధర గతంలో రూ. 45 వేల నుంచి లక్ష మధ్య ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ. 1.34 లక్షల నుంచి రూ. 2.25 లక్షల వరకు పలుకుతోంది. షికాగో – ముంబై ఈ రూట్‌లో విమాన టికెట్‌ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి, రూ. 1.9 లక్షల నుంచి రూ. 2.8 లక్షలకు చేరాయి. నెవార్క్, వాషింగ్టన్ వంటి నగరాల నుంచి వచ్చే విమానాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సాధారణంగా ఆసియా, అమెరికా ఖండాలను అనుసంధానించే ప్రధాన కేంద్రంగా మధ్యప్రాచ్యం ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా ఈ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు విమాన సంస్థలు వెనకాడుతున్నాయి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం, ఒకప్పుడు విమానాలతో రద్దీగా ఉండే ఈ గగనతలం ఇప్పుడు వెలవెలబోతోంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం వల్ల ఇంధన ఖర్చు, ప్రయాణ సమయం పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతోంది. వేసవి సెలవులు దగ్గరపడుతున్న వేళ ఈ ధరల పెరుగుదల ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా

Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

LPG Cylinder: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు

Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు

Follow Us