అమెరికాలో జాహ్నవి కందుల మృతికి రూ.262 కోట్ల పరిహారం
సియాటెల్‌లో పోలీసు నిర్లక్ష్యంతో మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి ₹262 కోట్ల పరిహారం చెల్లించడానికి సియాటెల్ అంగీకరించింది. 2023లో అధికారి కెవిన్ డేవ్ వాహనం ఢీకొని జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర నిరసనలు, భారత ప్రభుత్వ జోక్యం తర్వాత కెవిన్ తొలగింపబడ్డాడు. న్యాయపోరాటానికి బదులు, భారీ పరిహారంతో కేసును ముగించాలని సియాటెల్ నిర్ణయించింది, ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి బలైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించడానికి సియాటెల్ యంత్రాంగం అంగీకరించింది. కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి కందుల 2021లో అమెరికా వెళ్లింది. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. అయితే 2023 జనవరి 23వ తేదీ రాత్రి సియాటెల్ వీధిలో ఆమె రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసు అధికారి కెవిన్ డవే తన పెట్రోలింగ్ వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ వచ్చి జాహ్నవిని ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు ఆమె 100 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం తర్వాత కెవిన్ డవే అహంకారంతో కామెంట్లు చేసాడు. ముఖ్యంగా జాహ్నవి మరణంపై జోకులు వేస్తూ.. “ఆమె ఒక సాధారణ వ్యక్తి. ఈ మరణానికి పెద్దగా విలువ లేదు.. కేవలం ఒక చెక్ రాసి ఇచ్చేస్తే సరిపోతుంది” అని వ్యాఖ్యానించాడు. ఆయన చేసిన ఈ కామెంట్లు బాడీ కెమెరాలో రికార్డు కావడంతోపాటు.. తర్వాత నెట్టింట వైరలయ్యాయి. కెవిన డవే వ్యాఖ్యలపై ప్రపంచం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌తోపాటు అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అమెరికా పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని వేగంగా విచారణ జరిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ అధికారి కెవిన్ ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్లు తేలింది. దీంతో ఈ దారుణానికి బాధ్యుడైన కెవిన్‌ను విధుల నుంచి తొలగించారు. జాహ్నవి కుటుంబం న్యాయ పోరాటం చేయగా.. విచారణ ఎదుర్కోవడం కంటే భారీ పరిహారం చెల్లించి రాజీ పడటమే ఉత్తమమని సియాటెల్ నగర యంత్రాంగం భావించింది. గత వారం ఇరుపక్షాల లాయర్లు కోర్టులో ఈ పరిహార ఒప్పందం గురించి దరఖాస్తు దాఖలు చేశారు. బుధవారం ఈ ఒప్పందం ఖరారు కావడంతో రూ. 262 కోట్లు చెల్లించేందుకు సియాటిల్ నగర యంత్రాంగం సిద్ధమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: నా ప్రతి ప్రయాణం.. సవాళ్లతోనే మొదలవుతుంది
Karthikeya 3: కార్తీకేయ3 గురించి క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
Venkatesh: వరుస ప్రాజెక్ట్స్ తో విక్టరీ వెంకటేష్ జోరు.. క్యూ కడుతున్న దర్శకులు
నటనలో భేష్.. చదువుల్లో శభాష్ అనిపిస్తున్న హీరోయిన్లు
హిట్ కోసం సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తున్న స్టార్ హీరోలు