Crime: అమెరికాలో ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి.

|

Dec 01, 2023 | 3:07 PM

అమెరికాలో భారతీయ కుటుంబంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తాత, అవ్వ, మామలను దారుణంగా కాల్చి చంపాడు. ఆ ఇంటినుంచి తుపాకి పేలిన శబ్ధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు.న్యూజెర్సీలోని సౌత్‌ ప్లెయిన్‌ ఫీల్డ్‌లో ఓ అపార్ట్‌మెంట్లో దిలీప్‌ కుమార్‌ బ్రహ్మభట్‌, బిందు బ్రహ్మభట్‌, యశ్‌ కుమార్‌ బ్రహ్మభట్‌ అనే ముగ్గురు నివాసముంటున్నారు.

అమెరికాలో భారతీయ కుటుంబంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తాత, అవ్వ, మామలను దారుణంగా కాల్చి చంపాడు. ఆ ఇంటినుంచి తుపాకి పేలిన శబ్ధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. న్యూజెర్సీలోని సౌత్‌ ప్లెయిన్‌ ఫీల్డ్‌లో ఓ అపార్ట్‌మెంట్లో దిలీప్‌ కుమార్‌ బ్రహ్మభట్‌, బిందు బ్రహ్మభట్‌, యశ్‌ కుమార్‌ బ్రహ్మభట్‌ అనే ముగ్గురు నివాసముంటున్నారు. ఇటీవలే దిలీప్‌ కుమార్‌ బ్రహ్హభట్‌ మనవడు ఓం బ్రహ్మభట్‌ కూడా న్యూజెర్సీకి వచ్చి వారివద్దే ఉండి చదువుకుంటున్నాడు. ఈ సందర్భంలో, నవంబరు 27 ఉదయం 9 గంటలకు వారి ఇంట్లో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంటి రెండో అంతస్తులో దిలీప్‌, బిందు మృతి చెంది కనిపించారు. తర్వాత యశ్‌కుమార్‌ శరీరంలో బుల్లెట్‌ గాయాలు ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడే ఉన్న బ్రహ్మభట్‌ను పోలీసులు విచారించారు. నిందితుడు వారిని చంపేందుకు ఆన్‌లైన్‌లో తుపాకీ కొనుగోలు చేసినట్టు తెలిపాడు. బ్రహ్మభట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 01, 2023 03:07 PM