అమెరికాలో గడ్డి కోస్తూ లక్షల్లో సంపాదన.. నెటిజన్ల రియాక్షన్‌ ఇదే!

Updated on: Jun 23, 2026 | 8:44 PM

అమెరికాలో గడ్డి కోసే పనులు చేసే వ్యక్తి కూడా లక్షల రూపాయలు సంపాదిస్తూ విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నాడంటూ ఓ భారతీయ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో వైరల్ అయింది. విదేశాల్లో శ్రమకు లభించే గౌరవం, ఆదాయంపై చర్చ మొదలైంది. అయితే అధిక సంపాదనతో పాటు అక్కడి జీవన వ్యయం, అద్దెలు, వైద్య ఖర్చులు కూడా భారీగానే ఉంటాయని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

డబ్బులెవరికీ ఊరికే రావు.. ఏదోరకంగా కష్టపడితేనే వస్తాయి..అందుకు ఉదాహరణే ఈ ఘటన. అమెరికాలో ఓ సాధారణ ఉద్యోగానికి లభించే వేతనం, అక్కడి శ్రమ సంస్కృతిపై ఒక భారతీయ కంటెంట్ క్రియేటర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. అమెరికాలో గడ్డి కోసే పనులు చేసే వ్యక్తి చాలా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నాడని, విలాసవంతమైన ఆడి కారులో తిరుగుతున్నాడంటూ అతడు షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సదరు భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్.. అక్కడ గడ్డి కత్తిరించే పనులు చేసే వ్యక్తి ఏడాదికి ఏకంగా రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నాడని తెలిపారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన ఒక ఆడి కారును చూపిస్తూ.. ఆ వ్యక్తి ఈ కారునే వాడుతున్నాడని వివరించాడు. విదేశాల్లో ఏ పనీ చిన్నది కాదని, శ్రమకు తగిన గౌరవంతో పాటు అద్భుతమైన సంపాదన లభిస్తుందని చెప్పడం అతని ముఖ్య ఉద్దేశం అని తెలుస్తోంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేశారు. కొందరు ఈ శ్రమ గౌరవాన్ని చూసి స్ఫూర్తి పొందామని, తాము కూడా అమెరికా వెళ్తామంటూ సానుకూలంగా స్పందించారు. మెజారిటీ నెటిజన్లు మాత్రం అక్కడి వాస్తవ పరిస్థితులను గుర్తుచేస్తున్నారు. అమెరికాలో సంపాదన ఎంత ఎక్కువగా ఉంటుందో, దానికి తగ్గట్టే జీవన వ్యయం , ఇళ్ల అద్దెలు, వైద్య ఖర్చులు కూడా ఆకాశాన్నంటుతాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. కేవలం కారును చూసి మోసపోవద్దని, అక్కడ కూడా పేదరికం, ఆర్థిక ఇబ్బందులు భారీగా ఉంటాయని వాస్తవాలను కామెంట్ల రూపంలో వివరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాలుగు షాపుల్లో చొరబడిన దొంగలు.. పాపం చివరికి దొరికింది ఇదే!

టీఆర్ ఫైలింగ్‌లో ‘క్లాడ్ ఏఐ’ హవా.. సీఏను మించిన అద్భుతమైన పని తీరు!

క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి! సంచలనంగా వ్యాపారవేత్త కామెంట్

ఏఐ వల్ల ఈ ముప్పు కూడా ఉందా? ఆలోచించడం మానేస్తే ప్రమాదమంటున్న నిపుణులు

ఈ డెలివరీ గర్ల్‌ వేరే లెవల్‌..? ఖుష్బూ కథకు సెల్యూట్!

Follow Us