సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో

Updated on: May 28, 2026 | 3:56 PM

చైనాకు చెందిన బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ జియాంగ్ చెంగ్లాన్ కేవలం 24 గంటల్లోనే కోటి మందికి పైగా ఫాలోవర్లను సంపాదించి సంచలనం సృష్టించారు. ఏజెన్సీ వివాదాల కారణంగా మూడేళ్లు సోషల్ మీడియాకు దూరమైన ఆమె, కొత్త అకౌంట్‌తో రీఎంట్రీ ఇవ్వగానే అభిమానులు భారీగా ఫాలో అయ్యారు. ఈ ఘనత సోషల్ మీడియాలో కొత్త రికార్డుగా మారింది.

సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ, చైనాకు చెందిన ఒక బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం కేవలం 24 గంటల్లోనే కోటి మందికి పైగా ఫాలోవర్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన ఫీట్, గతంలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌లో నెలకొల్పిన రికార్డును గుర్తుచేస్తోంది. వివరాల ప్రకారం.. జియాంగ్ చెంగ్లాన్ అనే చైనాకు చెందిన మేకప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చైనా వీడియో షేరింగ్ యాప్ ‘డౌయిన్’లో గతంలో 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. అయితే, తన మాజీ ఏజెన్సీ ‘షాంఘై జిన్ జియా కంపెనీ’తో తలెత్తిన వివాదాల కారణంగా 2023 మే నుండి ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. ఆమె పాత ఆన్‌లైన్ పేరు ‘చెంగ్షియాన్’ను సదరు ఏజెన్సీ ట్రేడ్‌మార్క్‌గా నమోదు చేసుకోవడంతో, ఆమె ఆ పేరును వాడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మే 13న ఆమె తన అసలు పేరుతోనే కొత్త అకౌంట్ తెరిచి రీఎంట్రీ ఇచ్చారు. ఆమెపై అభిమానంతో కేవలం ఒకే రోజులో కోటి మందికి పైగా నెటిజన్లు ఆమెను ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా జియాంగ్ మాట్లాడుతూ.. తన పాత అకౌంట్‌తో గానీ, దానికి అనుబంధంగా ఉన్న షాపులతో గానీ తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో పాత అకౌంట్ లో ఎలాంటి వస్తువులూ కొనవద్దని అభిమానులను హెచ్చరిస్తూ, తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

Follow Us