Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

Updated on: Aug 02, 2026 | 12:50 PM

భారతీయ పర్యాటకులకు బుర్జ్ ఖలీఫా సందర్శన మరింత సులభమైంది. ఇకపై అధికారిక వెబ్‌సైట్‌లో యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. యూఏఈలో ఈ-కామర్స్ చెల్లింపుల కోసం యూపీఐని స్వీకరించిన తొలి సంస్థగా బుర్జ్ ఖలీఫా నిలిచింది. ఈ సేవతో భారతీయులు విదేశీ ప్రయాణానికి ముందే సులభంగా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం లభించింది.

భారతీయ పర్యాటకులకు దుబాయ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ‘బుర్జ్ ఖలీఫా’ను సందర్శించేందుకు ఇప్పుడు మన దేశానికి చెందిన యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. యూఏఈలో ఈ-కామర్స్ లావాదేవీల కోసం యూపీఐ చెల్లింపులను స్వీకరిస్తున్న తొలి సంస్థగా బుర్జ్ ఖలీఫా నిలిచింది. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ , నియోపే, ఈమార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రారంభించారు. దీనివల్ల భారతీయ పర్యాటకులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందే బుర్జ్ ఖలీఫా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమ వద్ద ఉన్న యూపీఐ యాప్‌లతో అత్యంత సులభంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. గతంలో యూఏఈలోని వ్యాపార సంస్థల వద్ద క్యూఆర్ కోడ్‌ల ద్వారా ప్రత్యక్ష యూపీఐ చెల్లింపులు మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ బుకింగ్స్‌కు కూడా దీనిని విస్తరించడం పర్యాటకులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. భారతీయులకు డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతంగా, సుపరిచితంగా మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

ఉదయాన్నే టీ తాగుతున్నారా? ఇది తెలిస్తే ఇక టీ జోలికి వెళ్లరు

Loading...
Unable to load recommendations.
Follow Us