Iceland: 14 గంటల్లో 800 భూ ప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్‌లాండ్‌.

Updated on: Nov 12, 2023 | 7:18 PM

ఐస్‌లాండ్‌ వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. యూరోప్‌కు చెందిన ద్వీప దేశంలో సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు నమోదయ్యాయి. రెక్జానెస్‌ ప్రాంతంలో ఇవి చోటుచేసుకున్నాయి. దాంతో ఐస్‌లాండ్‌ తాజాగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాజధాని నగరం రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన ప్రకంపనలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై అత్యధికంగా 5.2 గా నమోదైంది.

ఐస్‌లాండ్‌ వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. యూరోప్‌కు చెందిన ద్వీప దేశంలో సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు నమోదయ్యాయి. రెక్జానెస్‌ ప్రాంతంలో ఇవి చోటుచేసుకున్నాయి. దాంతో ఐస్‌లాండ్‌ తాజాగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాజధాని నగరం రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన ప్రకంపనలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై అత్యధికంగా 5.2 గా నమోదైంది. దాంతో సమీప ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం కావడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్‌ ప్రాంతంలో 24వేల ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సుమారు 800 ప్రకంపనలు నమోదయ్యాయి. తీవ్రమైన భూ ప్రకంపనల కారణంగా ప్రజల రక్షణార్థం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని, ఈ వరుస ఘటనలు అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీయొచ్చని హెచ్చరించారు. రానున్న రోజుల్లో విస్ఫోటం సంభవించే అవకాశం ఉందని ఐస్‌లాండ్ వాతావారణ విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రిండావిక్‌ అనే జనావాస ప్రాంతం ఉంది. అక్కడ నాలుగువేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్యలో వారిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో.. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు సర్వసాధారణం. ఒక్క ఐస్‌లాండ్‌లో 33 క్రియాశీలక అగ్నిపర్వత వ్యవస్థలు ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Loading...
Unable to load recommendations.
Follow Us