Nuclear Submarine: ‘చైన్, యాంకర్ ఉచ్చు’లో తానే పడ్డ డ్రాగన్.. 55 మంది మృతి..!
యెల్లో సీలో అణు ప్రమాదం జరిగింది. చైనాకు చెందిన అణు సబ్‌మెరైన్ తన ఉచ్చులో తానే చిక్కుకుపోయింది. దీంతో 55 మంది సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయాన్ని బ్రిటీష్ మీడియా కథనాలుగా ప్రచురించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. యెల్లో సముద్రంలో ఆగస్టు 21న చైనా అణు జలాంతర్గామిలో బ్యాటరీల శక్తి అయిపోయింది. ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ట్రీట్‌మెంట్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చని బ్రిటన్ నిపుణులు చెబుతున్నారు.
యెల్లో సీలో అణు ప్రమాదం జరిగింది. చైనాకు చెందిన అణు సబ్‌మెరైన్ తన ఉచ్చులో తానే చిక్కుకుపోయింది. దీంతో 55 మంది సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయాన్ని బ్రిటీష్ మీడియా కథనాలుగా ప్రచురించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. యెల్లో సముద్రంలో ఆగస్టు 21న చైనా అణు జలాంతర్గామిలో బ్యాటరీల శక్తి అయిపోయింది. ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ట్రీట్‌మెంట్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చని బ్రిటన్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చారు. కానీ, అది కూడా విఫలం కావడంతో గాలి కలుషితమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడింది. దీనికి మరమ్మత్తులు చేయడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. ఈ సమయంలో 55 మంది ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. ఈ సబ్‌మెరైన్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో క్వింగ్‌డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఇక్కడికి అమెరికా, బ్రిటన్‌ల జలాంతర్గాములు రాకుండా ఎల్లో సముద్రంలో డ్రాగన్ ఏర్పాటు చేసిన ‘చైన్, యాంకర్ ఉచ్చు’లో దాని సబ్‌మెరైనే చిక్కినట్లు డైలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. బీజింగ్ నౌకాదళం సాధారణంగా ఇలాంటి ఉచ్చులను ఉపయోగిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడే అదే దాని కొంపముంచింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..