కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు

Updated on: Nov 10, 2026 | 4:26 PM

ఖమ్మం జిల్లా కూసుమంచిలోని బీఎస్‌జే జువెలర్స్‌లో మహిళల ముఠా చోరీకి పాల్పడింది. కస్టమర్లుగా వచ్చిన మహిళలు గుమాస్తా ఉపేందర్‌ దృష్టి మళ్లించి సుమారు రూ.2 లక్షల విలువైన వెండి పట్టీల బాక్సులను అపహరించారు. నగలు నచ్చలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి చోరీ విషయం గుర్తించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఒక బంగారం దుకాణంలో చోరీ జరిగింది. కస్టమర్లుగా నటించి లోపలికి వచ్చిన ఓ ముఠా, దుకాణ గుమాస్తాను చాకచక్యంగా మాటల్లో పెట్టి భారీ మొత్తంలో వెండి ఆభరణాలను కొట్టేసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు మరియు బాధితుల వివరాలు ప్రకారం.. కూసుమంచిలోని ‘B.S.J జువెలర్స్’ దుకాణంలోకి గురుతుతెలియని కొందరు మహిళలు కొనుగోలుదారుల ముసుగులో ప్రవేశించారు. ఆ సమయంలో దుకాణంలో ఉపేందర్ అనే గుమాస్తా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ మహిళలు రకరకాల నగలు చూపించామని కోరుతూ అతడి దృష్టిని మళ్లించారు. గుమాస్తా వారి కోరిక మేరకు ఆభరణాలు చూపిస్తుండగా, అతన్ని మాటల్లో పడేసి అత్యంత చాకచక్యంగా వెండి పట్టీల బాక్స్‌లను దొంగిలించారు. అనంతరం తమకు మోడల్స్‌ నచ్చలేదని చెప్పి.. అక్కడినుంచి జారుకున్నారు. కొంతసేపటి తర్వాత ఆభరణాల పెట్టెలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గుమాస్తా ఉపేందర్ వెంటనే వారి కోసం పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ దొంగతనంలో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన వెండి పట్టీలు చోరీకి గురైనట్లు దుకాణ యజమాని బావుసింగ్ తెలిపారు. బాధితుడు బావుసింగ్ ఫిర్యాదు మేరకు కూసుమంచి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దుకాణంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలించారు. పక్కా ప్రణాళికతోనే ఈ చోరీకి పాల్పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ మహిళలముఠా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి

ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్‌ ధర భారీగా తగ్గింపు

నిరుద్యోగ యువతకు.. గుడ్‌న్యూస్‌

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. మరో 2 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్

ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్! తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ విప్లవం!

Loading...
Unable to load recommendations.
Follow Us