ఉదయం టీతో బిస్కెట్లు తీసుకుంటున్నారా? నెలరోజుల్లో మీ ఆరోగ్యంలో జరిగే మార్పు ఇదే!

Updated on: Nov 20, 2026 | 4:18 PM

చాలామంది ఉదయం టీతో పాటు రెండు బిస్కెట్లు తినడాన్ని అల్పాహారంగా భావిస్తారు. అయితే, ప్రతిరోజూ నెల రోజుల పాటు ఇదే అలవాటును కొనసాగిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, పోషకాల లోపం, నీరసం, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఈ అలవాటుకు బదులుగా బాదం, గుడ్లు, పండ్లు, మఖానా వంటి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చాలామంది భారతీయుల ఉదయం ఒక కప్పు వేడి వేడి టీ, దానికి తోడు రెండు బిస్కెట్లతో ప్రారంభమవుతుంది. తక్కువ ఖర్చుతో, సులభంగా దొరికే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ అలవాటు చాలామందిలో సాధారణం. కానీ, ప్రతిరోజూ ఇదే అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నెల రోజుల పాటు ఈ అలవాటును కొనసాగిస్తే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ, బిస్కెట్లు అప్పటికప్పుడు ఆకలిని తీర్చినా.. శరీరానికి అవసరమైన పోషకాలను మాత్రం అందించలేవు. ప్యాకెట్ బిస్కెట్లలో మైదా, చక్కెర, కొవ్వులు అధికంగా ఉంటాయి. తీపి కలిపిన టీ రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. దీనిని నియంత్రించేందుకు శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలంగా కొనసాగితే ఇన్సులిన్ నిరోధకత వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, వీటిలో ఫైబర్, ప్రొటీన్లు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండదు. ఉదయం 10 గంటలకే నీరసం, ఆకలి, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ టీబిస్కెట్ల అలవాటు కారణంగా.. పోషకాల లోపం తలెత్తుతుంది. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు అందక కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పీచు పదార్థాలు లోపించడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. టీలో ఉండే టానిన్లు ఆహారం ద్వారా అందే ఐరన్ శోషణను తగ్గిస్తాయి. అధిక కేలరీలు చేరడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. అయితే, పూర్తిగా టీ మానేయాల్సిన అవసరం లేదు కానీ, చక్కెర లేని టీ తాగుతూ.. బిస్కెట్లకు బదులుగా బాదం పప్పులు, ఉడికించిన గుడ్డు, మఖానా లేదా పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే.. అలాంటి వాటిని కట్టడి చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us