Cheating: ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.. దెబ్బ అదుర్స్ అంతే.. వీడియో.

|

Feb 27, 2023 | 9:51 AM

బీహార్‌లోని బుక్సర్‌ జిల్లా దుమ్రాన్‌కు చెందిన ఉమేష్‌ చౌదరి అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు.

బీహార్‌లోని బుక్సర్‌ జిల్లా దుమ్రాన్‌కు చెందిన ఉమేష్‌ చౌదరి అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అనంతరం రెండు కుటుంబాలు పెళ్లిపనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో సడన్‌గా వరుడి ఇంటికి పోలీసులు వచ్చారు. సరాసరి వరుడి దగ్గరకు వెళ్లి అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి వెంటే ఉమేష్‌ కుటుంబ సభ్యులూ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళారు. అక్కడ ఉమేష్‌కి తగిలిన షాక్‌తో అర్ధమైంది.. పోలీసులు తనని ఎందుకు తీసుకొచ్చారో.. ఉమేష్‌ గతంలో తమ ఇంటిపక్కనే ఉండే అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఉద్యోగ రిత్యా ఆ అమ్మాయి తండ్రి ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అమ్మాయి కూడా తండ్రితోపాటు ఢిల్లీకి వెళ్లి, అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఉమేష్‌కు ఆ యువతి తరచూ డబ్బు సహాయం చేస్తూ ఉండేది. అంతేకాదు, వారిద్దరూ అన్నిరకాలుగా దగ్గరయ్యారు. కానీ ఉమేష్ ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి సిద్దపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి స్వగ్రామానికి చేరుకుని, తల్లి సహాయంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయమంతా పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఉమేష్‌కు బ్రెయిన్‌వాష్‌ చేసి, అమ్మాయితో పెళ్లికి ఒప్పించారు. అయితే ఆ అమ్మాయి వయసు కేవలం 17సంవత్సరాలే కావడంతో పెళ్ళి జరగడానికి సంవత్సరం పాటు వెయిట్ చెయ్యాలని తెలిపారు. ఉమేష్ కూడా అందుకు అంగీకరించాడు. కానీ అతనితో సంబంధం కుదుర్చుకున్న కుటుంబం కూడా పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పెళ్ళి కోసం తాము ఖర్చు పెట్టిన డ్బబును తిరిగి ఇప్పించమంటూ డిమాండ్ చేశారు. చివరికి వారికి పరిహారం ఇవ్వడానికి కూడా ఉమేష్ ఒప్పుకోక తప్పలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..