Womens Fighting video: సచివాలయంలో మహిళల ఫైట్‌.. జుట్టు జుట్టు పట్టుకొని.. వైరల్‌ అవుతున్న వీడియో

|

Jan 28, 2022 | 9:31 AM

ఈ మధ్య జరిగే ప్రతి క్రైమ్‌ని గమనించండి.. దాని వెనుక పక్కా వివాహేతరం సంబంధం లేదా అక్రమ సంబంధం రీజన్ అయి ఉంటుంది. తాజాగా వివాహేతర సంబంధం ఇద్దరి మహిళల మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. ఈ ఘటన...

ఈ మధ్య జరిగే ప్రతి క్రైమ్‌ని గమనించండి.. దాని వెనుక పక్కా వివాహేతరం సంబంధం లేదా అక్రమ సంబంధం రీజన్ అయి ఉంటుంది. తాజాగా వివాహేతర సంబంధం ఇద్దరి మహిళల మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడులో జరిగింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ మహిళపై వివాహిత దాడికి దిగింది. మహిళ పనిచేస్తున్న సచివాలయంకు వెళ్లి తోటి ఉద్యోగుల ముందే ఆమెపై దాడి చేసింది వివాహిత.కరటంపాడు సచివాలయంలో పనిచేస్తున్న రషీదా అనే మహిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని వింజమూరుకు చెందిన నవ్య భారతి ఆరోపించింది. ఈమేరకు రషీదాపై నవ్యభారతి దాడికి దిగింది. తనపై దాడి చేసిన నవ్యభారతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సచివాలయం మహిళా ఉద్యోగి రషీదా . ఈ ఘర్షణ తాలుకా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.