Viral: కిలాడీ లేడీస్.! పెళ్లి, షాపింగ్ అంటూ వచ్చి.. ఖరీదైన చీరలతో ఉడాయించారు.!

|

Dec 02, 2023 | 11:53 AM

ఉపాధి కోసం ఇంట్లో బట్టల దుకాణం నడుపుతున్నారా? అయితే జాగ్రత్త... షాపింగ్ అంటూ వచ్చి దుకాణంలో ఉన్న విలువైన వస్తువులను కాజేసి ఉడాయిస్తున్నారు. సాధారణంగా దొంగతనాలు ఎవరూ లేని సమయం లోనో.. రాత్రి సమయం లోనో జరుగుతుంటాయి. కానీ కొందరు కిలాడీలు ఎంతో చాకచక్యంగా పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. షాపింగ్ అంటూ వచ్చిన విలువైన చీరలతో ఉడాయించారు కొందరు మహిళలు.

ఉపాధి కోసం ఇంట్లో బట్టల దుకాణం నడుపుతున్నారా? అయితే జాగ్రత్త… షాపింగ్ అంటూ వచ్చి దుకాణంలో ఉన్న విలువైన వస్తువులను కాజేసి ఉడాయిస్తున్నారు. సాధారణంగా దొంగతనాలు ఎవరూ లేని సమయం లోనో.. రాత్రి సమయం లోనో జరుగుతుంటాయి. కానీ కొందరు కిలాడీలు ఎంతో చాకచక్యంగా పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. షాపింగ్ అంటూ వచ్చిన విలువైన చీరలతో ఉడాయించారు కొందరు మహిళలు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా లోని నార్పల మండలం లోని కేశేపల్లిలో కేశవ, జానకి దంపతులు ఇంట్లోనే బట్టల షాపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఆ ఇంటిముందు ఆగారు. దుకాణంలోకి వెళ్లి ఇంట్లో పెళ్లి ఉంది చీరలు కావాలి చూపించమన్నారు. ఖరీదైన పట్టుచీటరలు చూపించమన్నారు. వారి వద్ద ఉన్న మంచి ఖరీదైన పట్టుచీరలు అన్నీ వారికి చూపించారు. చీరలు చూస్తున్న మహిళల్లో ఓ మహిళ కాస్త మంచినీళ్లు కావాలని చీరలు చూపిస్తున్న వ్యక్తిని అడిగింది. నీళ్లు తీసుకు రావడానికి లోపలకి వెళ్లగానే చీరలన్నీ బ్యాగులో సర్దేసి అక్కడినుంచి ఉడాయించారు ఆ కిలాడీ లేడీలు. దుకాణం ముందు స్టార్ట్‌ చేసుకొని రెడీగా ఉన్న కారులో మహిళలు ఉడాయించారు. కేశవ ఇంట్లో చోరీకి ముందు పక్కనే ఉన్న మరో షాపులోకి వెళ్లారు. అక్కడ సీసీ కెమెరాలు ఉండటంతో అక్కడినుంచి వచ్చేసి సీసీ కెమెరాలు లేని కేశవ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మంచినీళ్లు తెచ్చిన యజమానికి అక్కడ మహిళలు, చీరలూ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్క దుకాణంలోని సీసీ పుటేజీ ఆధారంగా నిందితులకోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.