మనవడితో మహిళ జంప్‌.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!

Updated on: May 03, 2025 | 3:59 PM

ఉత్తరప్రదేశ్‌ చిత్ర విచిత్ర సంఘటనలకు కేరాఫ్‌గా మారిందా అంటే అవుననే అనిపిస్తోంది. రోజుకో చిత్రమైన ఘటన వెలుగులోకి వస్తోంది. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగిపోతున్న జనాలు అన్నింటినీ పక్కనపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలను లీగల్‌ బంధాలుగా మార్చుకొని వెళ్లిపోతున్నవారు కొందరైతే.. తమ వివాహేతర సంబంధాలకు కుటుంబ సభ్యులు అడ్డుగా ఉంటున్నారని వారిని హతమార్చేందుకు పన్నాగాలు పన్నుతున్నవారు ఇంకొందరు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

 50 ఏళ్ల మహిళ మనవడి వరసైన ఓ 30 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుని గ్రామం నుంచి పరారైంది. అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇంద్రావతికి భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనవడి వరసైన ఆజాద్‌ను ఓ ఆలయంలో వివాహం చేసుకుని కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి తొలుత సమీపంలోని గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం గ్రామం నుంచి పరారయ్యారు. అంబేద్కర్ నగర్‌లోని ఒకే ప్రాంతంలో ఇంద్రావతి, ఆజాద్ నివసించేవారు. వరుసకు ఆజాద్‌ ఇంద్రావతికి మనవడు అవుతాడు. వారి మధ్యనున్న బంధుత్వం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే, వారిమధ్యనున్న బంధుత్వం కారణంగా వారిని ఎవరూ అనుమానించలేదు. గ్రామం నుంచి పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వారిద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటుండగా ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ గమనించాడు. వారిమధ్య జరుగుతున్న వ్యవహారం గురించి తెలుసుకుని భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఇద్దరూ పెద్దవాళ్లే కావడంతో అతడి ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us