కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి మె పెళ్లికి ఏం చేశారంటే.. వీడియో!

Updated on: Jan 24, 2025 | 2:38 PM

మగపిల్లలు లేని తల్లిదండ్రులు ఆడపిల్లలనే మగపిల్లలుగా భావిస్తూ పెంచుతుంటారు. ఈ క్రమంలో వారికి తగినంత స్వేచ్ఛనిస్తూ, సమస్తం సమకూరుస్తుంటారు. తమకు మగపిల్లలు లేరనే లోటును మరచిపోతుంటారు. ఇదిలా ఉంచితే నేటి కాలంలో ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు చెందిన ఒక తండ్రి తన కుమార్తెలోనే కుమారుడిని చూసుకున్నాడు. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు గుర్రపు స్వారీ చేయడాన్ని చూస్తుంటాం. కానీ ఖాండ్వాలో ఒక వధువు గుర్రపు స్వారీ చేసింది. తన తండ్రి కోరికను నెరవేర్చేందుకే ఆమె ఇలా చేసింది. ఖాండ్వాకు 8 కి.మీ. దూరంలో ఉన్న సుర్గావ్ జోషి గ్రామానికి చెందిన రైతు నానాజీ చౌదరి కుమార్తె వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నానాజీ చౌదరి తన కుమార్తెను కొడుకులా భావించి పెంచిపెద్ద చేశాడు. ఇప్పుడు తనకు కుమారుడు ఉన్న ముచ్చటను తన కుమార్తె పెళ్లిలోనే తీర్చుకోవాలనుకున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us