Bear Opens Car Door Steal Snacks : పర్వత పట్టణం గాట్లిన్‌బర్గ్‌లో నల్ల ఎలుగుబంట్లు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. అమెరికాలోని తూర్పు టేనస్సీలో ఉన్న గాట్లిన్‌బర్గ్.. గ్రేట్ స్మోకీ పర్వతాల జాతీయ ఉద్యానవనానికి ప్రవేశ ద్వారం. ఈ ప్రాంతంలో వందలాది ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి. అయితే ఒక ఎలుగుబంటి నిటారుగా నిలబడి కారు తలుపు తెరిచి.. స్నాక్స్ దొంగిలించడాన్ని కొంతమంది వీడియో తీస్తారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్‌లాక్ చేయబడిన కారు డోర్ నేర్పుగా తెరవడానికి ఎలుగుబంటి రెండు కాళ్లపై మనిషిలా నిలబడుతుంది. అనంతరం వాహనం లోపలికి వెళ్లి కొన్ని సెకన్ల తరువాత నోటిలో ఒక ప్యాకెట్ ఆహారంతో బయటపడుతుంది. దొంగిలించిన తర్వాత ఆ ప్యాకెట్ దానికి నచ్చదు. దూరంగా వెళ్ళే ముందు నేలపై పడవేస్తుంది. గాట్లిన్బర్గ్లో ఆహారం కోసం వేటాడటానికి నల్ల ఎలుగుబంట్లు తరచూ అరణ్యం నుంచి బయటకి వస్తాయి.
ఇక్కడ నివసించే వారందరు ఎలుగుబంట్లతో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. కొంతమంది వాటికి ఆహారంగా ఏదో ఒకటి వేస్తుంటారు. వాటితో కలిసి బతకడం ఇక్కడి ప్రజలకు అలవాటై పోయింది. 2019 లో గాట్లిన్‌బర్గ్‌లో కారు లోపలకి వెళ్లిన ఎలుగుబంటి దాని మూడు పిల్లలు ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారులో వెళుతున్న కొంతమంది స్నాక్స్ దొంగిలిస్తున్న ఎలుగుబంటి సంఘటనను దగ్గరగా చూస్తారు. ఇవి ఇలా కూడా చేస్తాయా అంటున్న మాటలు మనకు వీడియోలో వినిపిస్తూ ఉంటాయి.