పోలీస్ అవతారం ఎత్తిన దొంగ.. మోసాల వెనుక అసలు కథ ఇదే

Updated on: Feb 09, 2026 | 7:37 PM

విశాఖలో కానిస్టేబుల్‌గా, ఆపై నకిలీ డిఎస్పిగా అవతారమెత్తిన చెల్లుబోయిన లోచన్ కుమార్, ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశాడు. ఓ యువతికి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు లాగేశాడు. వాకిటాకీ, పోలీస్ వాహనాల వద్ద ఫోజులిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నకలి పోలీస్ అవతారమెత్తి పోలీసులకు అడ్డంగా బుక్కైన ఇతని పేరు చెల్లుబోయిన లోచన్ కుమార్. విశాఖలో ఉంటూ అక్కడి పోలీసులకే మస్కా కొట్టి తనను తాను కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకే డిఎస్పి నంటూ ఫేక్ పబ్లిసిటీ చేసుకొని నమ్మినవారిని నట్టేట ముంచాడు. ఇలానే ఓ యువతికి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏకంగా రూ.10 లక్షలు లాగేశాడు. వాకి టాకీ పట్టుకొని ఫోటోలు దిగడం, పోలీసు వాహనాల వద్ద ఫోజులు ఇవ్వడం.. ఆ ఫోటోలను స్టేటస్ లో డిపిలో పెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయడం చేశాడు. అందరినీ తాను నిజమైన పోలీస్‌నని నమ్మించాడు. ఫోర్త్ టౌన్ పరిధిలో.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఓ యువతని మాయమాటల్లో దింపాడు. తనకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల పరిచయం ఉందని.. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గర్నుంచి లక్షల రూపాయలు కాజేశాడు. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో అతని అసలు బండారం బయటపడింది. నెల్లూరు డిటిసిలో గెస్ట్ ఫ్యాకల్టీ గా వెళ్లి పోలీసులకు క్లాస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా ఎస్సై ఉద్యోగం పేరుతో మోసపోయిన యువతి పోలీసులను సంప్రదించేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు డిటిసికి చేరుకున్న ప్రత్యేక బృందం లోచన్‌ను అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియాలో యువతులతో వీడియో కాల్స్ మాట్లాడి రికార్డ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఒకానొక సమయంలో అతను ఏకంగా విశాఖ సిపి బాగ్చి దగ్గరకు వచ్చి.. ఏ ఆర్ శిక్షణ తీసుకుంటున్న పోలీసులతో పాటే ఫోటో కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తానికి నకిలీ డి.ఎస్.పి యవ్వారం బయటపడడంతో.. బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు అరా తీస్తున్నారు. ఉద్యోగం కష్టపడితే మాత్రమే వస్తుందని.. ఇలా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించడం సాధ్యం కాదని.. ఇలాంటి మాటలు నమ్మ జనాలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే ఇంటిని 25 మందికి అమ్మిన ఘనుడు.. భలే మోసపోయారుగా

Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్

Lok Sabha: గందరగోళం మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా

విలేపార్లే ఈస్ట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం

ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ