సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు

Updated on: Oct 20, 2026 | 4:02 PM

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో జీఎఫ్ఎస్ ప్రైడ్ కంటైనర్ నౌక మునిగిపోయింది. నౌకలో మంటలు చెలరేగడంతో 21 మంది సిబ్బందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన తర్వాత సముద్రంలో తేలుతున్న కంటైనర్ల నుంచి స్థానికులు ఐఫోన్లు, ఖరీదైన పర్ఫ్యూమ్‌లు తీసుకెళ్తున్నారంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో చాలా వీడియోలు ఏఐతో సృష్టించినవని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు గుర్తించాయి. ప్రమాదానికి కారణంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఓ భారీ కంటైనర్ నౌక మునిగిపోయిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జీఎఫ్ఎస్ ప్రైడ్’ అనే నౌక అక్టోబర్ 14న ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 2,500లకు పైగా కంటైనర్లతో వెళ్తున్న ఈ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే సకాలంలో స్పందించిన అధికారులు నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ స్పష్టం చేసింది. ఈ ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మునిగిపోయిన నౌక నుంచి సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్ల నుంచి స్థానిక జాలర్లు ఐఫోన్లు, ఖరీదైన పర్ఫ్యూమ్‌లను ఏరుకుంటున్నట్లు ఆ వీడియోల్లో ప్రచారం జరుగుతోంది. చిన్న పడవల్లో వెళ్లి కంటైనర్లను లాక్కెళ్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వైరల్ క్లిప్పులపై ప్రముఖ ఫ్యాక్ట్-చెక్ సంస్థలు జరిపిన పరిశీలనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వైరల్ అవుతున్న ఆ వీడియోల్లో చాలా వరకు నకిలీవిగా, కృత్రిమ మేధస్సు సృష్టించినట్లు ఆ సంస్థలు తేల్చాయి. నిజంగానే కంటైనర్లలో ఐఫోన్లు ఉన్నాయా? లేదా స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారా? అనేదానికి ఎలాంటి అధికారిక లేదా స్వతంత్ర ఆధారాలు లభించలేదు. మరోవైపు, ఈ నౌక ప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ప్రమాదమా లేక సముద్రంలో అమర్చిన మైన్‌ను ఢీకొట్టడం వల్ల జరిగిందా అనే దానిపై ‘ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఉద్రిక్తతలు నిండిన ఈ జలమార్గంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

టైప్-1 షుగర్‌ బాధలకు చెక్‌! 14 ఏళ్ల వరంగల్ కుర్రాడి జీవితమే దీనికి ఉదాహరణ!

నగరంలో పెరుగుతున్న నీటి కొరత.. భవిష్యత్తులో తప్పని ఇబ్బందులు!

Lucky Draw: ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్‌ నుంచి బార్‌ ఓనర్‌గా

Loading...
Unable to load recommendations.
Follow Us