Special Idli: విశాఖ యువకుడి స్పెషల్‌ ఇడ్లీకి.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిదా..! ఎట్రాక్ట్ చేస్తున్న ఇడ్లి..(వీడియో)

|

Dec 17, 2021 | 9:57 AM

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ స్పెషల్ డిష్‌ను పరిచయం చేశారు. విశాఖపట్నంలో చిట్టెం సుధీర్ అనే యువకుడు చిన్న తోపుడు బండి ద్వారా తయారు చేస్తున్న టేస్టీ టేస్టీ స్పెషల్ ఇడ్లీని జనానికి తెలియజేశారు.

YouTube video player
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ స్పెషల్ డిష్‌ను పరిచయం చేశారు. విశాఖపట్నంలో చిట్టెం సుధీర్ అనే యువకుడు చిన్న తోపుడు బండి ద్వారా తయారు చేస్తున్న టేస్టీ టేస్టీ స్పెషల్ ఇడ్లీని జనానికి తెలియజేశారు. రాగి, ఇతర సిరిధాన్యాలతో వండిన ఇడ్లీలను ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత ఇలాంటి ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈరోజు ఉదయం వాసెనపోలి వారి రాగి, జొన్న, ఇతర సిరిధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని ఆరగించాను. చాలా రుచిగా అనిపించాయి. ఆరోగ్యాన్నిచ్చే ఇలాంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ముఖ్యంగా యువత ఈ ఫుడ్ ను తిని ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. సిరిధాన్యాలతో సాంప్రదాయ పద్ధతిలో ఇలాంటి మంచి టిఫిన్ ను అందిస్తున్న విశాఖపట్నం యువకుడు చిట్టెం సుధీర్ కు అభినందనలు. వినూత్న ఆలోచనలతో మన సంప్రదాయ ఆహారపద్ధతులను కాపాడుకునేందుకు యువత చొరవ తీసుకోవాలని ట్వీట్‌ చేశారు వెంకయ్య నాయుడు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Dec 17, 2021 09:55 AM