Dawood Ibrahim: చావు బతుకుల మధ్య అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌.? కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స.

|

Dec 21, 2023 | 6:14 PM

మోస్డ్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ దావూద్‌ ఇబ్రహీమ్‌ చావుబతుకుల్లో ఉన్నట్లు పాకిస్తాన్‌ నుంచి వార్తలు వస్తున్నాయి. దావూద్‌ ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతున్నారు. కరాచీ ఆసుపత్రిలో డాన్‌ చేరినట్లు తెలుస్తోంది. దావూద్‌ మీద విష ప్రయోగం జరిగిందని అంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన సోషల్‌ మీడియా అకౌంట్లలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. దావూద్‌ మాజీ అనుచరులు మాత్రం, ఆయనను రెండురోజుల కిందటే ఆసుపత్రిలో చేర్చారని అంటున్నారు.

మోస్డ్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ దావూద్‌ ఇబ్రహీమ్‌ చావుబతుకుల్లో ఉన్నట్లు పాకిస్తాన్‌ నుంచి వార్తలు వస్తున్నాయి. దావూద్‌ ఆరోగ్యం విషమంగా ఉందని చెబుతున్నారు. కరాచీ ఆసుపత్రిలో డాన్‌ చేరినట్లు తెలుస్తోంది. దావూద్‌ మీద విష ప్రయోగం జరిగిందని అంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన సోషల్‌ మీడియా అకౌంట్లలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. దావూద్‌ మాజీ అనుచరులు మాత్రం, ఆయనను రెండురోజుల కిందటే ఆసుపత్రిలో చేర్చారని అంటున్నారు. ఈ వార్తలపై ముంబై పోలీసులు కూడా అలర్ట్‌ అయ్యారు. ముంబైలోని దావూద్‌ బంధువులను వారు సంప్రదిస్తున్నారు.

1993లో ముంబైలో వరుస బాంబుపేలుళ్ల తర్వాత దావూద్‌, మనదేశం నుంచి పారిపోయాడు. అప్పటినుంచి పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్నాడు. దావూద్‌ కరాచీలోనే నివాసం ఉంటున్నాడని, భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు పలుమార్లు చెబుతూ వచ్చాయి. అయితే దావూద్‌ మీద విష ప్రయోగం ఎవరు చేశారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 67 ఏళ్ల దావూద్‌ పలు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్‌ చనిపోయినట్లు పాకిస్తాన్‌ జనాలు ట్వీట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.