Viral Video: వామ్మో.. వీడి ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.. భారీ పైథాన్‌లతో గేమ్స్ ఆడేస్తున్నాడు.. వైరల్ వీడియో

Python Trending Video: ఈ వీడియోలో పైథాన్‌‌ను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. కొండచిలువతో అలాంటి సరదా ఎప్పటికైనా ప్రాణాంతకంగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. వీడి ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.. భారీ పైథాన్‌లతో గేమ్స్ ఆడేస్తున్నాడు.. వైరల్ వీడియో
Python And Boy Video

Updated on: Mar 04, 2022 | 2:20 PM

పాము(Snake) చిన్నదైనా, పెద్దదైనా చూస్తే చాలు ఎవరికైనా భయం వేస్తుంది. కానీ, ఒక బాలుడు(Boy with python) మాత్రం ఏమాత్రం భయపడుకుండా కొండచిలువల మధ్య కూర్చుని వాటితో సరదాగా గడుపుతున్నాడు. ఈ కొండచిలువ(Python)లు కూడా బాలుడిని ఏ విధంగానూ హాని చేయకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఆశర్చర్యపోవాల్సిందే. ఈ వీడియోలో పైథాన్‌‌ను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. కొండచిలువతో అలాంటి సరదా ఎప్పటికైనా ప్రాణాంతకంగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియోలో రెండు పెద్ద కొండచిలువలను చూడవచ్చు. ఒక అబ్బాయి చెట్టుకింద హాయిగా కూర్చొని కనిపించాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలుడు కొండచిలువను తన ఒడిలో పెట్టుకున్నాడు. అయితే, కొండచిలువ కూడా బాలుడిపై దాడి చేయకుండా గమ్మున ఉండిపోవడంతోపాటు ఆ బాలుడి లాలనను ఆస్వాదిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఈ వీడియో అందరినీ షాక్‌కి గురి చేసింది.

కొండచిలువతో బాలుడి ఈ ఆశ్చర్యకరమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో నేచర్27_12 ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత, కొంతమంది అబ్బాయిని చాలా డేరింగ్ అంటూ కామెంట్లు చేయగా, కొంతమంది మాత్రం పైథాన్‌లు ఎప్పటికైనా చాలా డేంజర్ అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు.

అదే సమయంలో, పాములు, మానవులకు ఎప్పటికీ స్నేహితులు కాలేవని మరొక వినియోగదారు చెప్పుకొచ్చారు. వాటి సహజ ఆవాసాలలో వదిలివేయాలి. ఈ పాములను చూసిన తర్వాతే నా పరిస్థితి మరింత దిగజారిపోతోందని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఈ కుర్రాడికి ఎందుకు భయంగా అనిపించడం లేదంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read: Viral Video: అడవికి రాజే కావొచ్చు.. నేను ఎంట్రీ ఇస్తే తోక ముడవాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Watch Video: మైదానంలో ముద్దుల వర్షం కురిపించిన విరుష్క జోడీ.. సెంచరీ టెస్ట్ స్పెషల్ ఇదేనంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో