కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
ముగ్గు కోసం వినియోగించే కళ్లాపి పొడిలో అత్యంత ప్రమాదకరమైన ‘ఆరమైన్-ఓ’ రసాయనం వాడుతున్నట్లు కడప జిల్లా తనిఖీల్లో తేలింది. ఈ విషపూరిత పొడిని తయారు చేస్తున్న పలు యూనిట్లపై అధికారులు దాడులు నిర్వహించి భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు యూనిట్లను సీజ్ చేసి, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ రసాయనం ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా అధికారులు హెచ్చరించారు.
తెల్లవారగానే ఇంటి ముంగిట ముగ్గు వేసేందుకు కళ్లాపి చల్లుతుంటారు. ఇందుకుగాను పేడకు బదులు ఇటీవల వినియోగిస్తున్న కళ్లాపి పొడి.. ప్రాణాంతక విషమని అధికారుల తనిఖీల్లో తేలింది. దీని తయారీలో అత్యంత హానికరమైన, పారిశ్రామిక రంగులకు వాడే ‘ఆరమైన్-ఓ’ అనే రసాయనాన్ని విచ్చలవిడిగా వాడుతున్నట్లు వెల్లడైంది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ, ప్రమాదకరమైన రంగుల తయారీపై పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు సంయుక్తంగా ముమ్మర దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఈ పొడి ద్రావణం తాగి జిల్లావ్యాప్తంగా దాదాపు 19 మంది బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ పొడి తయారీలో పారిశ్రామిక రంగులకు వాడే అత్యంత హానికరమైన ‘ఆరమైన్-ఓ’ అనే రసాయనాన్ని విచ్చలవిడిగా వాడుతున్నట్లు వెల్లడైంది. ఈ రసాయనం కడుపులోకి చేరినా, పీల్చినా కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రొద్దుటూరు మడూరు రోడ్డులోని ‘సౌభాగ్య కుంకుమ ఇండస్ట్రీస్’తో పాటు ఏడు ప్రాంతాల్లోని కేంద్రాలపై దాడులు చేసిన అధికారులు పెద్ద ఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. సౌభాగ్య, కామధేను, మహాలక్ష్మి, చంద్రిక, శ్రీదేవి, భూదేవి వంటి పేడ రంగు తయారీ కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఐదు యూనిట్లను తక్షణమే సీజ్ చేశారు. ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ప్రమాదకర పొడి తరలుతున్నట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు!
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి కానీ.. పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ!
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. బై శిక్షణ ఇస్తూ.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్