Tigers Fight: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. ఫైట్‌ మామూలుగా లేదు..!ఎందుకో తెలుసా.?

|

May 18, 2022 | 8:25 AM

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. నెటిజన్లు ఈ వీడియోలని ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా రెండు పులులకి మధ్య జరిగిన ఫైటింగ్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వాస్తవానికి అడవిలో ఒకే నియమం ఉంటుంది.


సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. నెటిజన్లు ఈ వీడియోలని ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా రెండు పులులకి మధ్య జరిగిన ఫైటింగ్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వాస్తవానికి అడవిలో ఒకే నియమం ఉంటుంది. ‘చంపండి లేదా చావండి’. అడవిలో జంతువుల మనుగడ నిత్య పోరాటమే.. ముఖ్యంగా క్రూర జంతువులైన పులులు, సింహాలు అడవిలో వాటి పరిధిని సృష్టించుకుంటాయి. ఆ పరిధిలోకి మరో జంతువు వస్తే అంతే సంగతులు. తాజాగా ఓ తెల్లపులి ఓ పసుపు పులి ఏరియాలోకి వచ్చినందుకు రెండిటి మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో మూడు పులులు ఉన్నాయి. ఇందులో ఒక తెల్లపులి రెండు పసుపు పులులు ఉంటాయి. అయితే తెల్లపులి పసుపు పులుల పరిధిలోకి రావడంతో అసలు గొడవ మొదలయింది. వాస్తవానికి ఏ పులి అయినా దాని పరిధిలోకి మరో పులిని రానివ్వదు. ఇది అడవి నియమం. ఇక్కడ తెల్లపులి పసుపు పులి పరిధిలోకి రావడంతో రెండు పులుల మధ్య భీకర పోరాటం సాగింది. నువ్వెంత అంటే.. నువ్వెంత అన్నట్టుగా గర్జిస్తూ భయంకరంగా కొట్లాడుకున్నాయి. ఆ రెండు పులుల గర్జనలతో అడవి ప్రతిధ్వనించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూస్తున్న వేలమంది తెగ లైక్‌ చేస్తూ.. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us on