ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి

Updated on: Nov 11, 2026 | 7:28 PM

పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌లో బీటీఆర్ టీఎఫ్-1 ఆడపులి మరోసారి తప్పించుకుంది. కాంక్రీట్ గోడ కింద నాలుగు అడుగుల లోతులో సొరంగం తవ్వి బయటపడింది. అస్సాంలోని మగ పులి వాసన గుర్తుల కారణంగా అటువైపు వెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 60 మంది సిబ్బంది, మూడు కుంకి ఏనుగులతో గాలింపు కొనసాగుతోంది. రేడియో కాలర్ సిగ్నల్స్ అందకపోవడంతో పులి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పులులు వేటాడటమే కాదు, ఏకంగా సొరంగాలు కూడా తవ్వగలవని పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌కు చెందిన ‘బీటీఆర్ టీఎఫ్-1′ అనే ఆడపులి అక్షరాలా నిరూపించింది. కాంక్రీటు గోడలతో కూడిన సురక్షితమైన ఆవరణలో ఉంచినప్పటికీ, గోడ కింద మట్టిలో తన పదునైన గోర్లతో సొరంగం తవ్వి అది మరోసారి తప్పించుకుంది. ఈ ఘటన అటవీ శాఖ అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలేం జరిగిందంటే.. గతంలో అస్సాంలో పట్టుబడిన ఈ ఆడపులిని నవంబర్ 4న బుక్సాలోని ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అయితే కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే అది మళ్లీ గోడ కింద సుమారు రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో సొరంగం తవ్వి పరారైంది. ’25-మైల్ టవర్’ ప్రాంతం నుంచి బయటపడిన పులి.. బాలా నదిని దాటి ’27-మైల్’ అటవీ ప్రాంతానికి చేరుకుంది. అస్సాం అడవుల్లోని ఓ మగ పులితో ఏర్పడిన బంధం, దాని వాసన గుర్తుల కారణంగానే ఈ ఆడపులి పదే పదే ఆ వైపు వెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పులి ఆచూకీ కోసం సుమారు 60 మంది శిక్షణ పొందిన సిబ్బంది, మూడు కుంకి ఏనుగులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దాని మెడలోని రేడియో కాలర్ సిగ్నల్స్ ‘నీడ ప్రాంతం’లోకి వెళ్లడంతో జాడ చిక్కడం కష్టమైంది. ఒకవేళ అది సంకోష్ నది దాటి అస్సాంలోని రైమోనా రిజర్వ్‌కు చేరుకుంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కట్టుదిట్టమైన భద్రతను సైతం ఛేదించి పులి సాగిస్తున్న ఈ రహస్య ప్రయాణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హాట్ టాపిక్‌గా.. అనిరుధ్ – కావ్యమారన్‌ పెళ్లి సందడి

చిరిగిన రూ.20 నోటు.. కస్టమర్‌ను కొట్టి చంపిన సిబ్బంది! ఇంత అన్యాయమా?

మతిపోయే కాన్సెప్ట్.. జక్కన్న ఊహ వేరే లెవల్‌..వారణాసి సినిమా స్టోరీ లీక్

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలకు వెళ్లే రైళ్లు రద్దు..

అబ్బో.. తేజ్‌ భార్య బ్యాగ్రౌండ్.. చాలా పెద్దదే.. ఆస్తులు కోట్లలోనే..

Published on: Nov 11, 2026 07:25 PM
Loading...
Unable to load recommendations.
Follow Us