Expensive Penthouse: పెంట్ హౌస్ ధర రూ 1,133 కోట్లు.! అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్..
దుబాయ్‌లో ఓ పెంట్ హౌస్ రూ 1,133 కోట్లకు అమ్ముడుపోయింది. అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొన్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది.
దుబాయ్‌లో ఓ పెంట్ హౌస్ రూ 1,133 కోట్లకు అమ్ముడుపోయింది. అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొన్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. రియాల్టీకి స్వర్గధామమైన దుబాయ్‌లో అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్‌ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్‌గా రికార్డు సృష్టించింది. లండన్‌లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది. 2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! బయ్యర్ వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్ ఎస్టేట్ పేర్కొంది. అయితే ఆ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ప్రావిడెంట్ ఎస్టేట్‌కు అసోసియేట్ పార్ట్‌నర్ అయిన శామ్ హొరానీ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.