ఈ చెట్టు పైన పక్షులు ఎందుకు ఉండవు? రహస్యం ఇదే!

Updated on: Feb 15, 2026 | 11:55 AM

ప్రకృతి వింతలకు, ఆధ్యాత్మిక అద్భుతాలకు నిలయం మన రాయలసీమ. అందులోనూ శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం గూటిబైలు గ్రామంలో వెలసిన 'తిమ్మమ్మ మర్రిమాను' ఒక అపురూప కట్టడం. ఒకే కాండంతో మొదలై, ఇప్పుడు ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టుగా 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

ఈ మహా వృక్షం వెనుక ఒక గొప్ప త్యాగగాథ ఉంది. 15వ శతాబ్దంలో తిమ్మమాంబ అనే మహిళ తన భర్త బాలవీరయ్య మరణానంతరం సతీసహగమనం చేసింది. ఆమె చితి కోసం నాటిన నాలుగు మర్రి గుంజలలో ఒకటి చిగురించి, ఈ మహావృక్షంగా ఎదిగిందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ చెట్టు 6,869 ఊడలతో ఒక పచ్చని అరణ్యాన్ని తలపిస్తుంది. అంతేకాదు, ఈ వృక్షం విషయంలో కొన్ని నమ్మశక్యం కాని విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చెట్టుపై పక్షులు మలవిసర్జన చేయవని, అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక్క పక్షి కూడా ఈ చెట్టుపై ఉండదని స్థానికులు చెబుతుంటారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ వైభవంగా జాతర జరుగుతుంది. ఆకాశం కనిపించనంత దట్టమైన హరిత పందిరిలా ఉండే ఈ వృక్షాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. రాయలసీమలో నీటి ఎద్దడి ఉన్నప్పటికీ, ఈ చెట్టు ఏడాది పొడవునా పచ్చదనంతో కళకళలాడటం విశేషం. ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మిక వాదులకు ఈ ప్రాంతం ఒక అద్భుత గమ్యస్థానం అని చెప్పవచ్చు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!