భారీ లోడుతో దూసుకెళ్తోన్న ట్రక్కు వెనకే వేగంగా వెళ్తోన్న బైక్‌.. కట్‌ చేస్తే.. మైండ్‌ బ్లాంక్‌

|

Jun 09, 2022 | 8:22 PM

దొంగల్లో రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇలాంటి దొంగల్ని ఎప్పుడూ చూసి ఉండరు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ షాకింగ్‌ సంఘటన చూస్తే ఆశ్చర్యపోతారు. సినీ ఫక్కీలో సాగిన ఈ చోరీ చూసి అంతా షాకవుతున్నారు.

దొంగల్లో రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇలాంటి దొంగల్ని ఎప్పుడూ చూసి ఉండరు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ షాకింగ్‌ సంఘటన చూస్తే ఆశ్చర్యపోతారు. సినీ ఫక్కీలో సాగిన ఈ చోరీ చూసి అంతా షాకవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, హైవేపై భారీ లోడుతో వేగంగా ఓ ట్రక్కు వెళ్తోంది. దాని వెనుక ఓ వ్యక్తి వేలాడుతూ ఉన్నాడు. అతను ఆ ట్రక్కుపై ప్యాక్‌ చేసిఉన్న లోడులోంచి ఒక పెద్ద ప్యాక్‌ను కింద పడవేస్తాడు. ఆ తర్వాత వెనుక బైక్‌పైన వస్తున్న అతని సహచరుడు తన బైక్‌ను ఆ ట్రక్కుకి దగ్గరగా తీసుకెళ్లాడు. ట్రక్కుపై వేలాడుతున్న వ్యక్తి ఎంతో చాకచక్యంగా ఈ బైక్‌పైకి దిగి కూర్చున్నాడు. ఈ దొంగలను చూస్తుంటే హాలీవుడ్ సినిమాల ప్రభావం వీరిపైన బాగా ఉన్నట్లు అనిపిస్తోంది. 17 సెకన్ల ఈ షాకింగ్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mount Etna: భయంకరంగా లావా విరజిమ్ముతున్నా వెనకడుగు వేయలేదు..

Digital TOP 9 NEWS: తప్పతాగి రోడ్డు మీద రచ్చ చేసిన చాహల్‌ | గాయపడి ఆస్పత్రికి వచ్చిన కోతి

Big News Big Debate:రిజల్ట్‌ రచ్చ !! ఉత్తీర్ణత శాతం తగ్గడానికి రీజనేంటి ?? ..లైవ్ వీడియో

 

Published on: Jun 09, 2022 08:22 PM