Smoke in Delhi: ఢిల్లీని వీడని పొగమంచు.. కళ్ల వాహనం కనిపిస్తే ఒట్టు.! వాతావరణశాఖ అలెర్ట్.
ఢిల్లీలో పొగ మంచు వీడడంలేదు.. ఉదయం ఇక్కడ విజిబిలిటీ సున్నా మీటర్లకు పడిపోయింది. దాదాపు 134 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి . ఢిల్లీనుంచి రాకపోకలు సాగించే పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రైళ్ల రాకపోకలపై కూడా వాతావరణం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ సహా 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఢిల్లీలో పొగ మంచు వీడడంలేదు.. ఉదయం ఇక్కడ విజిబిలిటీ సున్నా మీటర్లకు పడిపోయింది. దాదాపు 134 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి . ఢిల్లీనుంచి రాకపోకలు సాగించే పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రైళ్ల రాకపోకలపై కూడా వాతావరణం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ సహా 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాలం విమానాశ్రయంలో 25 మీటర్లు, సఫ్దార్‌గంజ్‌లో 50 మీటర్ల దూరం మాత్రమే కనిపిస్తోంది. ఢిల్లీ నగరంలో పలుచోట్ల ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఉదయం ఐదున్నర గంటల సమయంలో పొరుగున ఉన్న ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, వాయువ్య రాజస్థాన్‌లో విజిబిలిటీ 25 మీటర్లు మాత్రమే ఉంది. ఈ పొగమంచు డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగవచ్చని, ఇది మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. నగర వాసులకు డిసెంబర్ 31 తర్వాత కొంత ఉపశమనం లభించవచ్చని పేర్కొంది. ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వాయువ్య ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను మరికొన్నాళ్లు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పొగమంచు తీవ్రత దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్, అలీగఢ్ జిల్లాల్లో పాఠశాలల సమయాన్ని మార్పులు చేశారు. కొన్ని చోట్ల సెలవులు కూడా ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.