తనకు తాను వేసక్టమీ చేసుకున్న డాక్టర్..భార్య కోసం ఇలా.. వీడియో

Updated on: Jan 27, 2025 | 2:30 PM

ఇక పిల్లలు వ‌ద్దనుకున్న ఓ భ‌ర్త.. త‌న భార్యకు అరుదైన బ‌హుమ‌తి ఇచ్చాడు. అదేంటంటే..త‌న‌కు తానే సొంతంగా వేసెక్టమీ ఆప‌రేష‌న్ చేసుకుని.. భార్యను సంతోషంలో ముంచెత్తాడు. ఒక‌రిద్దరూ సంతానం క‌లిగిన త‌ర్వాత చాలా మంది దంప‌తులు ఇక త‌మ‌కు పిల్లలు వ‌ద్దనుకుంటారు. అలా అనుకునే వారు.. త‌క్షణ‌మే భార్యకు ట్యూబెక్టమీ ఆరేష‌న్ చేయించేందుకు సిద్ధమైపోతారు.

 అయితే పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆప‌రేష‌న్లు చేయించుకోవ‌చ్చు. కానీ వేసెక్టమీ ఆప‌రేష‌న్ల‌కు పురుషులు దూరంగా ఉంటున్నారు. ఎక్కడో ఒక చోట పురుషులు వేసెక్టమీ ఆప‌రేష‌న్ చేయించుకుంటున్నారు. అయితే వేసెక్టమీ ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు డాక్ట‌ర్లను సంప్రదిస్తారు. కానీ ఓ పురుషుడు స్వయంగా త‌న‌కు తానే వేసెక్ట‌మీ ఆప‌రేష‌న్ చేసుకుని అంద‌ర్నీ ఆశ్చర్యప‌రిచాడు. ఇది త‌న భార్యకు బ‌హుమ‌తి అని ఆ డాక్టర్ చెప్పుకొచ్చాడు. త‌న వేసెక్ట‌మీ ఆప‌రేష‌న్‌ను వీడియోగా చిత్రీక‌రించి.. సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.