Team work: పిల్లికి మస్కా కొట్టి ఈ కాకులు ఏం చేసాయో చూడండి.. కాకుల టీం వర్క్‌ ముందు తెల్లబోయిన పిల్లి..

|

Sep 17, 2022 | 9:00 AM

ఇంటర్నెట్ లో జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని చూసేందుకే కాకుండా ఇతరులతో పంచుకునేందుకూ నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.


ఇంటర్నెట్ లో జంతువులు, పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని చూసేందుకే కాకుండా ఇతరులతో పంచుకునేందుకూ నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. జంతువులు లేదా పక్షులు చేసే పనులు ఆశ్చర్యంతో పాటు నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకి చాలా తెలివైన పక్షి అని మనకు తెలిసిందే. రెప్పపాటు కాలంలో ఆహారాన్ని దొంగిలించడంలో వాటిని మించింది ఏదీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాకికి సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రెండు కాకులు ఒక జట్టుగా ఏర్పడి పిల్లిపై దాడి చేసాయి. అంతే కాదండోయ్.. పిల్లి దాచుకున్న ఆహారాన్ని దోచుకుని ఎగిరిపోయాయి. దీని కోసం ఓ కాకి పిల్లిని వెనుక నుంచి ముక్కుతో పొడిచింది. పిల్లి దానిపై దాడి చేయడానికి పరిగెత్తిన వెంటనే మరొక కాకి పిల్లి ఆహారాన్ని తీసుకుని ఎగిరిపోయింది. ఈ రెండు కాకులు తమ ప్లాన్ తో ఆహారాన్ని తెలివిగా సంపాదించాయి. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్ చేశారు. వందలాదిమంది తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ‘నిజంగా మనం టీమ్ వర్క్‌తో పని చేస్తే, కచ్చితంగా విజయం సాధిస్తాం’, ‘నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను కాకిని తెలివైన పక్షి ఎందుకు అంటారో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on