Viral Video: మందేసి పెళ్లికూతురు చిందులు.. ఎక్కడో తెలుసా..? వీడియో వైరల్..

|

Apr 10, 2023 | 8:24 AM

ఈ మధ్య పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకులు మద్యం తాగి వచ్చి హంగామా చేయడం.. వధువులకు ఇది నచ్చక పెళ్లిని రద్దు చేసుకున్న ఘటనలు మనం చూశాం. వాటికి భిన్నంగా ఓ పెళ్లి కూతురు మద్యం తాగి పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేసింది.

ఈ మధ్య పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకులు మద్యం తాగి వచ్చి హంగామా చేయడం.. వధువులకు ఇది నచ్చక పెళ్లిని రద్దు చేసుకున్న ఘటనలు మనం చూశాం. వాటికి భిన్నంగా ఓ పెళ్లి కూతురు మద్యం తాగి పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేసింది. తనకు రెండో పెళ్లి కావాలంటూ పోలీసులముందు వీరంగం ఆడేసింది. పోలీసులు ఎంతగా ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఆగలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ఓ మహిళకు ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేదో ఏమో కానీ, ఫుల్‌గా మందుకొట్టి పెళ్లి బట్టల్లోనే నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి వచ్చింది. తన ప్రియుడితో తనకు రెండో పెళ్లి జరిపించాలని గట్టిగా అరుస్తూ డిమాండ్ చేసింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమెను కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. పైగా వారి వద్ద ఉన్న కాగితాలను, ఫోన్లను విసిరేసి నానా హంగామా చేసింది. చివరికి ఓ లేడి కానిస్టేబుల్ అదుపు చేసి గదిలోకి లాక్కెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి పెళ్లి ఆమెకు బాధ కలిగించిందని ఒకరు.. తప్పతాగి ఇలా చేయడమేంటని మరొకరు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 10, 2023 08:24 AM