ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..

Updated on: Oct 04, 2026 | 10:11 PM

హనుమకొండ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండ శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర క్షేత్రంలో ఏడాదిలో కొన్ని రోజుల పాటు అద్భుత దృశ్యం కనిపిస్తుంది. భాద్రపద మాసంలో సూర్యాస్తమయ సమయంలో గుట్టపైని శిఖరాల మధ్య నుంచి వచ్చే సూర్యకిరణాలు గర్భగుడిలోని స్వయంభూ శివలింగాన్ని నేరుగా తాకుతాయని భక్తుల విశ్వాసం. సూర్యోదయ వేళ ఎదురుగా ఉన్న రామాలయంలోని శ్రీరాముడి విగ్రహంపైనా కిరణాలు ప్రసరిస్తాయని చెబుతారు.

హనుమకొండ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండ వద్దగల శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర క్షేత్రం అంతుచిక్కని ఆధ్యాత్మిక అద్భుతానికి నిలయంగా భాసిల్లుతోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో ఏడాది వ్యవధిలో కేవలం భాద్రపద మాసంలో మాత్రమే 10 నుంచి 15 రోజుల పాటు ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. గుట్టపై రెండు వరుసల్లో ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉండే ‘దొంతులమ్మ గుండ్లు’ అనే ఎత్తైన శిఖరాల మధ్య నుంచి సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వయంభూ శివలింగాన్ని స్పర్శిస్తాయి. పడమర ముఖంగా ఉన్న ఈ శైవక్షేత్రంలో కిరణాలు పడటం వల్ల శివలింగానికి పునఃశక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే సూర్యోదయ వేళ ఎదురుగా ఉన్న రామాలయంలోని శ్రీరాముడి విగ్రహంపై కూడా ఈ కిరణాలు ప్రసరిస్తాయి. శిల్పకళా నైపుణ్యమో లేక పరమేశ్వరుడి మహత్యమో తెలియని ఈ దృశ్యం భక్తులకు మైమరపును, రోమాంచిత అనుభూతిని అందిస్తుంది. 55 ఎకరాల విస్తీర్ణం, 120 మీటర్ల ఎత్తులో వెలసిన ఈ క్షేత్రంలో త్రేతాయుగం, ద్వాపరయుగాల నాటి ఆనవాళ్లు ఉన్నాయి. కరువు వచ్చినప్పటికీ ఇంకిపోని పాలగుండం, జీడిగుండం, కన్నుగుండం వంటి తొమ్మిది పవిత్ర గుండాలు ఇక్కడ నిత్యం జలకళతో ఉట్టిపడతాయి. అందులోని కన్నుగుండం కాశీ క్షేత్రంతో జలమార్గం కలిగి ఉందని భక్తులు విశ్వసిస్తారు. క్రీ.శ. 1198-1261 కాలంలో కాకతీయుల పాలనలో పునర్నిర్మించబడిన ఈ ఆలయాన్ని ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవతో భారీ రాజగోపురాలు, ప్రాకారాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్

గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే!

ప్రయాణికుడి దుస్సాహసం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం!

పంటను కాపాడుకోబోయి.. ప్రాణాలే కోల్పోయారు!

తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి వరుడితో ఏదో మాట్లాడింది.. ఉదయం చూసేసరికి వరుడు…

Loading...
Unable to load recommendations.
Follow Us