లెక్కల టీచర్‌ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

Updated on: May 19, 2026 | 5:21 PM

పెద్దపల్లి జిల్లా బేగంపేట ప్రభుత్వ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు మల్క రామకిషన్రావు తన హామీ నిలబెట్టుకున్నారు. పదో తరగతిలో 554 మార్కులు సాధించిన విద్యార్థి పూర్ణచందర్‌ను విమానంలో విశాఖపట్నం తీసుకెళ్లి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతూ, చదువుపై ఆసక్తి కలిగించేలా చేస్తున్న ఈ ఉపాధ్యాయుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు మల్క రామకిషన్రావు తన మాట నిలబెట్టుకుని విద్యార్థికి విమాన ప్రయాణం కల్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పదో తరగతిలో 550కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులను విమానం ఎక్కిస్తానని హామి ఇచ్చారు. హామీ మేరకు 554 మార్కులు సాధించిన విద్యార్థి పూర్ణచందర్ ను విశాఖపట్నం తీసుకెళ్లి పర్యాటక ప్రాంతాలు చూపించారు. గణిత ఉపాధ్యాయుడు మల్కా రామకిషన్రావు విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఏటా ఉత్తమ ఫలితాలు సాదించే విద్యార్థులకు విమానయానం చేయిస్తానని ప్రకటించారు. గత సంవత్సరంలో ఇద్దరు విద్యార్థులు ఈ ఘనత సాధించారు. బేగంపేట్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన శ్రీమంతుల పూర్ణచందర్ అనే విద్యార్థి పదోతరగతిలో ఆయన పెట్టిన టార్గెట్ ను రీచ్ అయ్యాడు. సొంతఖర్చులు వెచ్చించి అతడిని హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విమానంలో తీసుకువెళ్లారు. విద్యార్థులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. చదవాలనే సంకల్పాన్ని, పోటీతత్వం, పట్టుదలను కల్పిస్తే చాలు. ప్రభుత్వ బడి పిల్లలు ఎందులోనూ తీసిపోరు. కార్పొరేట్ కు దీటుగా పెద్ద ర్యాంకులూ సాధించగలరని నిరూపిస్తున్నారు. టీచర్‌ సైతం పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపుతూ, వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా వారు పనిచేసే ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు గణనీయంగా పెంచుతున్నారు. పేదల ఇంట చదువుల పంట పండిస్తున్నారు. సంకల్పం ఉండాలే కానీ సాధ్యం కానిది అంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగమే మీ గుర్తింపు కాదు.. మహిళ వీడియో వైరల్

Bermuda Triangle: 3 కోట్ల ఏళ్ల బెర్ముడా దీవి మిస్టరీని.. ఛేదించిన శాస్త్రవేత్తలు

అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్

సముద్రం అడుగున పైప్‌లైన్.. గ్యాస్ కష్టాలకు చెక్ పడేనా

కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం

Follow Us