Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??
ప్రస్తుత పెళ్లిళ్ల ట్రెండ్‌కు భిన్నంగా, నల్గొండకు చెందిన మేఘన రెడ్డి 'ఆర్గానిక్ వివాహం' చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ప్లాస్టిక్ రహిత అలంకరణ, చేనేత వస్త్రాలు, స్థానిక, రసాయన రహిత ఆహార పదార్థాలతో విందు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు, స్థానిక రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ వినూత్న పెళ్లి అందరికీ స్ఫూర్తినిచ్చింది.
ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, కోట్లలో ఖర్చు, విదేశీ వంటకాలతో హంగామా చేయడం పరిపాటిగా మారింది. కానీ, నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌కు చెందిన మేఘనా రెడ్డి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ కాలుష్యం లేకుండా, ఆరోగ్యాన్ని పంచేలా ‘ఆర్గానిక్ పెళ్లి’ చేసుకుని వార్తల్లో నిలిచారు. బీటెక్ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమవుతున్న మేఘన, తన వివాహాన్ని నిరాడంబరంగా, ప్రకృతికి దగ్గరగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబోయే భర్త కౌటిల్య రెడ్డి, తల్లిదండ్రులు ఆమె ఆలోచనను మెచ్చుకోవడంతో ఈ వినూత్న వేడుక సాకారమైంది. పెళ్లిలో వధూవరులతో పాటు బంధువులంతా చేనేత వస్త్రాలను ధరించడం విశేషం. ప్లాస్టిక్ సెట్టింగులకు బదులు మామిడి తోరణాలు, తాటాకు, కొబ్బరి మట్టలతో పందిరిని ముస్తాబు చేశారు. ఈ పెళ్లిలో అతిథులను ఆశ్చర్యపరిచింది అక్కడి విందు భోజనం. బాస్మతికి బదులు మైసూరు మల్లిక, నవారా వంటి భిన్న వరి రకాలతో వంటలు చేయించారు. పనస బిర్యానీ, జొన్న గటక, రాగి సంకటి, సిరిధాన్యాల పులిహోర, జొన్నరొట్టె, పచ్చిపులుసు, సకినాలు, భక్ష్యాలు సిద్ధం చేయించారు. రసాయన రహిత కూరగాయలు, దేశీ ఆవు నెయ్యి, బెల్లం ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాలు వడ్డించారు. పర్యావరణవేత్త సురేశ్ గుప్తా స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేఘన తెలిపారు. “పెళ్లిళ్లు ప్రకృతికి హాని చేయకూడదు, స్థానిక రైతులకు మేలు జరగాలి” అన్న ఆమె సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఆర్గానిక్ విందు ఆరగించిన బంధువులంతా ఇది ఒక మధురమైన, ఆరోగ్యకరమైన అనుభూతి అంటూ కొనియాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే
సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్
Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా
చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్
