Married at bus stand: బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న విద్యార్థులు.. సాక్షిగా నిలిచిన ఇతర విద్యార్థులు.!

|

Oct 18, 2022 | 9:56 AM

తమిళనాడు కడలూరు జిల్లా చిదంబరంలో ఈ వింత సంఘటన జరిగింది. స్థానిక బస్టాండ్‌వద్దలో స్కూల్‌ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్ధిని కూర్చుని ఉంది. ఆమె ప్లస్‌ టు చదువుతున్నట్టు తెలుస్తుంది. ఇంతలో


ఇటీవల ప్రేమ వివాహాలు సర్వసాధారణమైపోయాయి. తల్లిదండ్రులు కాదంటే వారిని ఎదిరించి ఏ గుడిలోనో, మరోచోటో ఇష్టపడినవారిని పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడు కడలూరులో జరిగింది. పాలిటెక్నిక్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు బస్టాండ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి తోటి విద్యార్థులు సాక్షులుగా నిలిచారు. ఈ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇంతలో అక్కడకి స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్ధి వచ్చాడు. ఆ అమ్మాయి మెడలో తాళికట్టేశాడు. తోటి విద్యార్ధులంతా వారికి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వారు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలల సంక్షేమ అధికారి రమ్య నేతృత్వంలో ఈ ఘటనపై అధికారుల బృందం విచారణ జరుపుతోంది. కాగా, విద్యార్థుల పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బాలాజీ గణేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow us on