Viral Video: పాము, పిల్లికి వైరం ఎందుకు వచ్చిందబ్బా??
పాము తన దారిన పోతుంటే....పిల్లి దాన్ని వెళ్ళకుండా మాటి మాటికీ అడ్డు తగిలింది. దీంతో పాము కూడా పిల్లిపై బుసలు కొట్టింది. దీంతో కాసేపు రోడ్డుపై పాము, పిల్లి మధ్య ఫైటింగ్ జరిగింది. పాము, పిల్లి ఫైటింగ్ దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్లు రికార్డు చేసి....సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఆ వీడియో మీరూ చూడండి...
నడి రోడ్డుపై పాముతో పిల్లి ఫైట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఈ పాము, పిల్లి ఫైటింగ్ ఎక్కడ అనుకుంటున్నారా???? అక్కడికే వస్తున్నాం. అనంతపురం పట్టణంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదురుగా పాము, పిల్లి ఢిష్యుం… ఢిష్యుం అంటూ కొట్లాడాయి. ఆ దృశ్యాలను అటుగా వెళ్తున్న వాహనదారులు సెల్ ఫోన్లో బంధించారు.. పాము, పిల్లికి మధ్య జాతి వైరం లేదు కదా….మరి ఎందుకు ఫైట్ చేసుకున్నాయబ్బా??? అని ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు. పాము తన దారిన పోతుంటే….పిల్లి దాన్ని వెళ్ళకుండా మాటి మాటికీ అడ్డు తగిలింది. దీంతో పాము కూడా పిల్లిపై బుసలు కొట్టింది. దీంతో కాసేపు రోడ్డుపై పాము, పిల్లి మధ్య ఫైటింగ్ జరిగింది. పాము, పిల్లి ఫైటింగ్ దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్లు రికార్డు చేసి….సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఇప్పటి వరకు పాము, ముంగీస ఫైట్ చేసిన సందర్భాలు చూశామని, పాము, పిల్లి పోట్లాడటం చూడలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

