అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్‌ బాల్స్‌ మింగేసిన పాము.. ఆ తర్వాత

Updated on: Sep 30, 2026 | 4:41 PM

అమెరికాలోని టెక్సాస్‌ శాన్‌ఆంటోనియోలో ఓ పాము ఏకంగా మూడు గోల్ఫ్‌ బంతులను మింగేసింది. బంతులు కడుపులో ఇరుక్కుపోవడంతో దానిని సౌత్‌ టెక్సాస్‌ ఏవియన్‌ అండ్‌ ఎగ్సాటిక్‌ హాస్పిటల్‌కు తరలించారు. పశువైద్యులు మత్తు మందు ఇచ్చి, శస్త్రచికిత్స చేయకుండానే ఒక్కో బంతిని చేతులతో నెమ్మదిగా నోటి వైపు నెట్టారు. అనంతరం మూడు బంతులను సురక్షితంగా బయటకు తీసి పాము ప్రాణాలను కాపాడారు. చికిత్స వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాలోని టెక్సాస్ శాన్ ఆంటోనియోలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. ఆహారమని పొరబడో లేక మరేదైనా కారణంతోనో ఒక పాము ఏకంగా మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. ఆ బంతులు కడుపులో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థ పడుతున్న ఆ పామును గమనించిన స్థానికులు, వెంటనే ‘సౌత్ టెక్సాస్ ఏవియన్ అండ్ ఎగ్సాటిక్ హాస్పిటల్’కు తరలించారు. పామును పరీక్షించిన పశువైద్యులు.. దానికి సర్జరీ చేయకుండానే బంతులను బయటకు తీయాలని నిర్ణయించారు. ముందుగా పాముకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం దాని శరీరంలో లోపల ఇరుక్కుపోయిన ఒక్కో గోల్ఫ్ బంతిని వైద్య బృందం ఎంతో నైపుణ్యంతో, చేతులతో నెమ్మదిగా పాము నోటి వైపునకు నెట్టారు. బంతి నోటి వద్దకు రాగానే, పాము నోరు తెరవడంతో వాటిని సులభంగా బయటకు తీశారు. ఈ విధంగా ఆపరేషన్ అవసరం లేకుండానే మూడు బంతులను సురక్షితంగా బయటకు తీసి పాము ప్రాణాలను కాపాడారు. ఇది తమకు ఎప్పటికీ గుర్తుండిపోయే కేసు అని, అరుదైన జంతువులకు వైద్యం చేసేటప్పుడు ఇలాంటి ఊహించని కేసులు ఎదురవుతుంటాయని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఈ చికిత్సకు సంబంధించిన వీడియోను ఆసుపత్రి యాజమాన్యం తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రీపెయిడ్ యూజర్లకు శుభవార్త.. 30 రోజుల ప్లాన్ తప్పనిసరి

సినిమా రేంజ్ ఛేజింగ్.. కారుపై వేలాడుతూ 40 కి.మీ వెళ్లిన కానిస్టేబుల్

ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి భయంతో పరుగు

బుల్లెట్‌ ట్రైన్‌లో టీమ్‌ ఇండియా.. ఆటగాళ్ల రియాక్షన్‌ చూస్తే

PM-KISAN: రైతులకు దసరా ధమాకా.. ఆ రోజే అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

Loading...
Unable to load recommendations.
Follow Us