Snake in bike: ఇతని ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..! స్కూటీ ముందు భాగంలో దూరిన నాగుపాము.. వీడియో

|

Nov 07, 2022 | 9:34 AM

నాగుపాము.. ఈ పేరు వినగానే భయంతో వణికిపోతాం. ఇక ప్రత్యక్షంగా చూస్తే.. పరుగులు పెడతాం. అలాంటి పాము పడగవిప్పి బుసలు కొడుతూ ఎటాక్‌ చెయ్యాలని చూస్తే.. గుండె దడదడే.. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది.


బుసలుకొడుతున్న పామును ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా చేత్తో పట్టుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ అవినాష్‌ యాదవ్‌ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో యాక్టీవా ముందు భాగంలో ఓ నాగుపాము దూరింది. దాన్ని బయటకు తీసేందుకు పాములు పట్టేవ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. ముందుగా స్క్రూ డ్రైవర్‌ సాయంతో యాక్టీవా ముందు ఓపెన్‌ చేశాడు. అంతరం పామును బయటకు పంపేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే, అది ఎంతకీ బయటకు రాకపోగా.. ఆ వ్యక్తిపైకి బుసలు కొడుతూ ఎటాక్‌ చేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ వ్యక్తి పట్టుకోల్పోకుండా, తన చేతిని పాముకి దొరకనివ్వకుండా ఎంతో జాగ్రత్తగా పామును బయటకు తీసాడు. అతను చేసిన ఈ సాహసాన్ని అక్కడే ఉన్న వారు వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అతని సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Follow us on