ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

Updated on: Feb 20, 2026 | 12:21 PM

వేల విష సర్పాలను పట్టిన స్నేక్ క్యాచర్ మోహన్, కర్నూలు మహానంది ఆలయంలో నాగుపాము కాటుకు గురయ్యారు. పామును పట్టుకునే ప్రయత్నంలో కోడెత్రాచు ఎదురుదాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మోహన్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భక్తులు, స్థానికులు ప్రార్థిస్తున్నారు.

ఏ ఇంట్లో పాము దూరినా, ఏ పొలంలో కొండచిలువ కనిపించినా అక్కడి ప్రజలకు గుర్తొచ్చే మొదటి పేరు ‘స్నేక్ క్యాచర్ మోహన్’. వేల సంఖ్యలో విష సర్పాలను అత్యంత చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టిన అతడు అదే పాము కాటుకు గురైన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదికూడా సాక్షాత్తు ఆ మహానందీశ్వరుడి సన్నిధిలో కోడెత్రాచు కాటేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయ ప్రాంగణంలో బుధవారం ఒక నాగుపాము హల్‌చల్ చేసింది. భక్తులు భయాందోళనకు గురికావడంతో సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ మోహన్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎప్పటిలాగే పామును బంధించే ప్రయత్నం చేస్తుండగా, ఒక్కసారిగా ఆ కోడెత్రాచు ఎదురుదాడి చేసి మోహన్‌ను కాటేసింది. వేల పాములను పట్టిన అనుభవం ఉన్నా, క్షణకాలం జరిగిన అజాగ్రత్త అతని పాలిట ప్రాణాంతకంగా మారింది. పాము కాటుకు గురైన వెంటనే అప్రమత్తమైన మోహన్, ఆలయ పరిసరాల్లో ఉన్న వైద్యుల వద్ద ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందుతోందని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో క్లిష్టమైన సమయాల్లో పాములను పట్టి ప్రాణాలను కాపాడిన మోహన్, తనే పాము కాటుకు గురికావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మహానంది భక్తులు, స్థానికులు కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జబర్దస్త్ నటుడికి దారుణ అనుభవం.. లేడీ అనుకుని పొలాల్లోకి లాక్కెళ్లి మరీ

అద్భుతం.. పెన్సిల్ మొనపై శివయ్య రూపం.. రికార్డుల రారాజు

Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త

తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ

హైదరాబాద్ లో రూ. 13 వేల కోట్ల ఆన్ లైన్ గేమింగ్ ఫ్రాడ్

Loading...
Unable to load recommendations.
Follow Us