ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
విశాఖపట్నం గోపాలపట్నంలోని ఓ ఇంట్లో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ఇంట్లో వింత శబ్దాలు రావడంతో పరిశీలించగా, వాష్‌రూమ్‌లోని కమోడ్ దగ్గర సుమారు ఆరడుగుల విషపూరిత నాగుపాము కనిపించింది. భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే పెందుర్తికి చెందిన స్నేక్ క్యాచర్ సునీల్ బృందానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బృందం చాకచక్యంగా పామును బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించింది. పాము కనిపిస్తే కొట్టకుండా దూరంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం వర్షాకాలమే అయినా ఎల్‌నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వాతావరణం వేసవిని తలపిస్తోంది. దీని ప్రభావంతో పుట్టలు, పొదల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి రావడం ఎక్కువైపోయింది. తాజాగా విశాఖపట్నంలోని గోపాలపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయంతో పరుగులు తీయించింది. గోపాలపట్నం ప్రాంతంలోని ఓ ఇంట్లోనుంచి వింత శబ్దాలు వినిపించడంతో కుటుంబ సభ్యులు ఇల్లంతా వెతికారు. ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అయితే, వాష్‌రూమ్ వైపు వెళ్లేసరికి ఆ శబ్దాలు మరింత ఎక్కువగా వినిపించాయి. అనుమానం వచ్చిన వారు నెమ్మదిగా తలుపు తెరిచి చూసారు. అంతే వారికి గుండె ఆగినంత పనైంది. వాష్‌రూమ్‌లోని కమోడ్ దగ్గర సుమారు ఆరడుగుల పొడవున్న భారీ విషపూరిత నాగుపాము నక్కి భుసలు కొడుతూ కనిపించింది. అది చూసి హడలిపోయిన కుటుంబ సభ్యులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై పెందుర్తికి చెందిన స్నేక్ క్యాచర్ సునీల్ బృందానికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సునీల్ బృందం చాకచక్యంగా వ్యవహరించి, ఆ నాగుపామును విజయవంతంగా బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుని సునీల్ బృందాన్ని అభినందించారు. వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్నేక్ క్యాచర్ సూచించారు. రాత్రి సమయాల్లో ఇంటి ఆవరణలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు టార్చ్ లైట్లు వాడాలి. ఇంట్లోకి పాములు రాకుండా తలుపులు, కిటికీలు సరిగ్గా వేసుకోవాలి. పాము కనిపిస్తే వెంటనే భయపడి కొట్టడానికి ప్రయత్నించకుండా, దూరం జరిగి స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదు..
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు! వైరల్ అవుతున్న కియారా, సిద్ధార్థ్ కొత్త ఫోటో!