Python: వామ్మో.! ఏంటి ఇంతుంది.. కొండచిలువకు ఎన్ని కష్టాలు వచ్చాయో.. అదిరిపోయే వీడియో.

|

Oct 25, 2023 | 8:30 AM

కొండచిలువల దాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూసేందుకు వాటి నోరు చిన్నదే అయినా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేస్తుంటాయి. జంతువులను వేటాడే క్రమంలో ఒక్కోసారి అనుకోని ప్రమాదంలో పడతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెద్ద జంతువును మింగిన కొండచిలువకు ఊహించని సమస్య వచ్చి పడింది. ఈ వీడియోలో ఓ పెద్ద కొండచిలువ ఆహారం వెతుక్కుంటూ ఓ షెడ్డులోకి వెళ్లింది.

కొండచిలువల దాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూసేందుకు వాటి నోరు చిన్నదే అయినా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేస్తుంటాయి. జంతువులను వేటాడే క్రమంలో ఒక్కోసారి అనుకోని ప్రమాదంలో పడతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెద్ద జంతువును మింగిన కొండచిలువకు ఊహించని సమస్య వచ్చి పడింది. ఈ వీడియోలో ఓ పెద్ద కొండచిలువ ఆహారం వెతుక్కుంటూ ఓ షెడ్డులోకి వెళ్లింది. అందులో ఉన్న జంతువులను టార్గెట్ చేసి.. ఎంతో చాకచక్యంగా వేటాడింది. వాటిలో ఓ పెద్ద జంతువును అవలీలగా మింగేసింది. ఆ తర్వాతే దానికి ఊహించని సమస్య వచ్చిపడింది. అంత పెద్ద జంతువును మింగడంతో కడుపు భారమై కదలడం కష్టమైపోయింది. అయినా ఓపిక తెచ్చుకుని షెడ్డు చుట్టూ ఉన్న కంచెను దాటి బయటపడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కొండచిలువ తల అంతకుముందే అక్కడ ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుపోతుంది. పాపం ఉచ్చునుంచి తప్పించుకోడానికి శతవిధాలా ప్రయత్నించింది. తలను అటూ ఇటూ ఊపడంతో ఉచ్చు మరింత బిగుసుకుపోయింది. తర్వాత ఉచ్చు ఏర్పాటు చేసిన వారు అక్కడికి వచ్చి కొండచిలువను బయటికి లాగే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియో అక్కడితో ముగియడంతో కొండచిలువ పరిస్థితి ఏంటి అనేది తెలియరాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..