Crime: వీళ్లు మామూలోళ్లు కాదు.. పట్టపగలు ఎంతకు తెగించారు..! వైరల్ వీడియో.
మనదగ్గర విలువైన వస్తువులు కానీ, పెద్దమొత్తంలో నగదు కానీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు ఎగరేసుకుపోతారు. ఇటీవల బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వారిని గమనించి వారి వద్దనుంచి డబ్బు కొట్టేసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా బెంగళూరులో రోడ్డుమీద పార్క్ చేసిన కారులో లక్షల రూపాయల నగదును చాకచక్యంగా కొట్టేశారు దొంగలు.
మనదగ్గర విలువైన వస్తువులు కానీ, పెద్దమొత్తంలో నగదు కానీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు ఎగరేసుకుపోతారు. ఇటీవల బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వారిని గమనించి వారి వద్దనుంచి డబ్బు కొట్టేసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా బెంగళూరులో రోడ్డుమీద పార్క్ చేసిన కారులో లక్షల రూపాయల నగదును చాకచక్యంగా కొట్టేశారు దొంగలు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చేరి వైరల్ అవుతోంది. బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో బీఎండబ్ల్యూ కారు పార్క్ చేసి ఉంది. ఎలా కనిపెట్టారో కానీ ఇద్దరు వ్యక్తులు కారు అద్దం పగలగొట్టి ఏకంగా 14 లక్షల నగదును కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. వీడియో ప్రకారం.. పార్క్ చేసిన కారు వద్దకు మాస్క్ ధరించి వచ్చిన ఓ యువకుడు పరిసరాలు గమనించాడు. ఎవరి బిజీలో వారున్నారు. హెల్మెట్ పెట్టుకుని , ముఖం కనిపించకుండా కర్చిఫ్‌తో కట్టుకున్న మరో వ్యక్తి బైక్‌పై అక్కడికొచ్చాడు. అతను అక్కడ కాపలా ఉండగా, మరో యువకుడు కారు వద్దకు వెళ్లి జేబులోంచి ఏదో పరికరం తీసి డ్రైవింగ్ సీట్లోని అద్దంపై గీశాడు. ఆ తర్వాత బలంగా రెండు దెబ్బలు వేయడంతో అద్దం పగిలిపోయింది. వెంటనే అందులోంచి కారులోకి దూరి డబ్బు ప్యాకెట్‌ను అందుకున్నాడు. అంతే చకచకా బైక్ ఎక్కేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..