అటవీ మార్గంలో బస్సు పై దాడి.. ప్రయాణికుల హాహాకారాలు

Updated on: Apr 12, 2026 | 4:53 PM

చిన్న కారణంతో బైకర్ RTC బస్సుపై దాడి చేసిన ఘటన రోడ్డుపై సహనం ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తుంది. సైడ్ ఇవ్వలేదని కోపంతో, నర్సంపేట బస్సును అటవీ మార్గంలో ఆపి, అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన రోడ్డు భద్రత, సహనం ఆవశ్యకతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది.

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సహనం ఎంత ముఖ్యమో తెలిపే ఘటన ఇది. కేవలం సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఓ ద్విచక్ర వాహనదారుడు ఏకంగా ఆర్టీసీ బస్సుపైనే దాడికి దిగాడు. అడవి మార్గంలో బస్సును అడ్డుకుని, అద్దాలు పగలగొట్టి బీభత్సం సృష్టించిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొత్తగూడ మండలం నుంచి నర్సంపేట వైపు వెళ్తోంది. ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ – పాకాల మధ్య ఉన్న అడవి మార్గంలో ఓ బైకర్ బస్సు వెనుక వస్తూ పదే పదే హారన్ కొట్టాడు. అయితే అది సింగిల్ రోడ్డు కావడంతో డ్రైవర్ వెంటనే సైడ్ ఇవ్వలేకపోయాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. బస్సును అత్యంత వేగంతో ఓవర్ టేక్ చేసిన సదరు వాహనదారుడు, అడవి మధ్యలో బస్సుకు అడ్డంగా తన బైక్ నిలిపివేశాడు. డ్రైవర్, కండక్టర్‌లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, పెద్ద రాళ్లతో బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో ఈ దాడి జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఆ వ్యక్తి ప్రవర్తన చూసి అంతా భయాందోళనకు గురయ్యారు. దాడి అనంతరం ఆర్టీసీ సిబ్బంది అదే బస్సులో ఖానాపురం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మావిగన్ అంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

RTC Bus Drivers: బస్సు డ్రైవర్లు అంటే అంత చులకనా… ఇంకెంత కాలం బలి అవ్వాలి ?

దేవుడా.. అన్నదాతల కష్టాలు చూస్తున్నవా ?? పొలానికి ట్యాంకర్‌ నీళ్లే దిక్కు

ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్‌.. ఎక్కడో తెలుసా ??

Published on: Apr 12, 2026 04:52 PM
Follow Us