రుద్రాక్షలో ప్రభాస్ ఫొటో.. కుప్పంలో అభిమాని కళా నైపుణ్యం

Edited By:

Updated on: Oct 24, 2026 | 4:25 PM

ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా కుప్పానికి చెందిన చిత్రకారుడు పురుషోత్తం ప్రభాస్‌ ప్రత్యేక కళాఖండాన్ని రూపొందించాడు. రుద్రాక్షపై బాహుబలి స్టార్‌ను శివుడి రూపంలో చిత్రీకరించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గతంలో చిరంజీవి, రామ్‌చరణ్‌, బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల చిత్రాలను వినూత్నంగా రూపొందించిన ఆయన, తాజా కళాఖండంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. రుద్రాక్షపై ప్రభాస్‌ పెయింటింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

కుప్పం కు చెందిన చిత్రకారుడు పురుషోత్తం ప్రభాస్ బర్త్డే రోజు అందరినీ ఆకట్టుకునేలా చేశాడు. పూరి ఆర్ట్స్ పురుషోత్తం తన కళా ప్రదర్శనతో రుద్రాక్ష పై హీరో ప్రభాస్ ఫోటో ను చిత్రీకరించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రుద్రాక్ష పై కళాఖండాన్ని ఆవిష్కరించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రుద్రాక్షలో ఉన్న ప్రభాస్ ఫోటో అభిమానులను పెద్ద ఆకట్టుకుంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ ఎన్టీఆర్ ఫోటోలను పలు రూపాల్లో విభిన్నంగా చిత్రీకరించిన పూరి పురుషోత్తం పొలిటికల్ లీడర్ల బర్త్ డే లను కూడా తన కళా నైపుణ్యంతో ఆకట్టుకునేలా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ఫోటోలను తనదైన శైలిలో చిత్రీకరించి అభిమానులను ఆకట్టుకునేలా చేశాడు. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ చిత్రాన్ని రుద్రాక్ష లో అద్భుతంగా చిత్రీకరించి అబ్బురపరిచాడు. శివుడు క్యారెక్టర్ లో ప్రభాస్ ని రుద్రాక్షలో ఆవిష్కరించిన పురుషోత్తం అభిమానుల మన్నలను పొందుతున్నాడు. సోషల్ మీడియాలోనూ రుద్రాక్ష లోని ప్రభాస్ పెయింటింగ్ వైరల్ అవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?

గన్‌ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?

దంపతుల రీల్స్‌ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా

ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

Published on: Oct 24, 2026 04:23 PM
Loading...
Unable to load recommendations.
Follow Us