కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

Updated on: May 18, 2026 | 6:24 PM

సింగపూర్‌లో పబ్లిక్ ప్రదేశాల్లో నేలపై పడిన మామిడికాయలను ఏరుకున్నా భారీ జరిమానా పడొచ్చని ఓ భారతీయ మహిళ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అక్కడి చట్టాల ప్రకారం అనుమతి లేకుండా పండ్లు సేకరిస్తే రూ.3.75 లక్షల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. నేచర్ రిజర్వ్ ప్రాంతాల్లో అయితే మరింత కఠిన శిక్షలు ఉంటాయని సమాచారం. విదేశాల్లో స్థానిక చట్టాలపై అవగాహన అవసరమని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

పండ్లలో రారాజుగా కీర్తించే మామిడపండ్లు వచ్చే కాలమే ఈ వేసవి. ఈ సమయంలో ఎటుచూసినా..ఈ పండ్ల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. సింగపూర్‌లోని పబ్లిక్ ప్లేసుల్లో నేల రాలిన మామిడికాయలను ఏరుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ చిన్న పనికి దాదాపు 3.75 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చంటూ ఓ భారతీయ మహిళ చేసిన హెచ్చరిక ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయంపై భారతీయ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న ప్రియాంక సిన్హా తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. సింగపూర్‌లో పబ్లిక్ ప్రదేశాల్లోని మామిడి చెట్ల నుంచి పడిన పండ్లను కూడా ఏరుకోకూడదని, అవి ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారని ఆమె తెలిపారు. వాటిని సేకరించాలంటే నేషనల్ పార్క్స్ బోర్డ్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వివరించారు. అనుమతి లేకుండా మామిడికాయలు కోసినా, కిందపడినవి ఏరుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగపూర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పబ్లిక్ పార్కుల్లో అనుమతి లేకుండా ఫలాలు సేకరిస్తే పార్క్స్ అండ్ ట్రీస్ చట్టం కింద 5,000 సింగపూర్ డాలర్లు అంటే సుమారు రూ. 3.75 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అదే నేచర్ రిజర్వ్ లేదా జాతీయ పార్కుల్లో అలా చేస్తే 50,000 సింగపూర్ డాలర్లు అంటే రూ. 37 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ పోస్ట్‌పై భారతీయ నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశంలో రోడ్డు పక్కన పండ్లు కోసుకుని తినడం సాధారణమని, సింగపూర్ రూల్ చాలా ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సింగపూర్ కఠినమైన నిబంధనలు, క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, విదేశాలకు వెళ్లేవారు అక్కడి స్థానిక చట్టాలను తెలుసుకుని మెలగడం మంచిదని ఈ ఘటన గుర్తుచేస్తోంది. అయితే ఈ పండ్లను తినేముందు నీటిలో నానబెట్టడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి. ఇది కేవలం మామిడి పండ్లను శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదని..అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలందించే విధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం

Follow Us