దెయ్యాలకు నిలయంగా పిలువబడే ఒక హోటల్ గురించి తాజాగా అక్కడ చాలా చర్చ జరుగుతోంది. ఈ హోటల్లో ఆత్మలు తిరుగుతున్నట్లు తాము చూశామని చెబుతున్నారు అక్కడి ప్రజలు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంది ఆ హోటల్. ఇది సుమారు 100 సంవత్సరాల నాటిది. 14 అంతస్తుల ఈ హోటల్ ను 1926 సంవత్సరంలో నిర్మించారు. ఇందులో 450 గదులు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, స్పా కూడా ఉన్నాయి. అయితే, ఈ హోటల్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కారణం ఇక్కడ కనిపించే దెయ్యాలు అనే వింత వాదనలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1941 నుంచి 1944 వరకు ఈ హోటల్ ఆర్మీ క్వార్టర్‌గా ఉండేదని, ఆ తర్వాత మళ్లీ నిర్మానుష్యంగా మారిందని చెబుతున్నారు. 1963లో హోటల్‌గా పునఃప్రారంభించినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ మూతపడింది. ఇక్కడి ప్రజలు పారానార్మల్ యాక్టివిటీ జరగడం కళ్ళారా చూస్తున్నామని చెబుతుండటం విశేషం. ఈ హోటల్లో బస చేసిన వ్యక్తులు ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని, కొన్నిసార్లు అవి మన శరీరాలను గీసుకుంటూ వెళ్తాయని చెప్పారు. అంతేకాదు అవి మనల్ని పళ్లతో కొరికేందుకు కూడా ప్రయత్నిస్తాయంటారు. అంతే కాకుండా హోటల్ గోడల నుంచి కూడా వింత వాసన వస్తుందని చెబుతారు. ఎవరో సిగార్ తాగుతున్నట్లుందని ఆ దెయ్యం ఆ హోటల్ ఓనర్‌దే కావచ్చని ఎందుకంటే అతనికి సిగార్ అంటే ఇష్టమనే వాదన కూడా ఉంది. హోటల్లో దెయ్యాలు ఉన్నాయా అని పరిశోధించడానికి కొంతమంది పారానార్మల్ నిపుణులు కూడా వచ్చారట. ఇక్కడ కారిడార్లలో కొన్నిసార్లు ఎర్రటి జుట్టుతో ఒక మహిళ, కొన్నిసార్లు ఆకుపచ్చ కళ్ళు ఉన్న స్త్రీ కనిపించిందని చెబుతారు. అయితే, ఈ వింత పారానార్మల్ కార్యకలాపాలను దాటవేస్తూ ఇప్పుడు మరోసారి ఈ హోటల్‌ను తెరవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..