లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా

Updated on: Feb 17, 2026 | 1:43 PM

పట్టిసీమలోని వీరభద్రస్వామి ఆలయం 1200 ఏళ్ల చరిత్ర కలిగినది. గోదావరి నది ద్వీపంలో కొలువై, దక్షయజ్ఞ ధ్వంసం కథను వివరిస్తుంది. ఇక్కడ లక్ష్మణుడు లేని సీతారాముల ఆలయం అరుదైన విశేషం. భద్రకాళి సమేత వీరభద్రస్వామి పూజలందుకుంటున్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. భద్రాచలం సీతారాముల రక్షణ కథతో ముడిపడిన ఈ పవిత్ర స్థలం దర్శనీయం.

గోదావరి నది గర్భంలో ద్వీపంపై ప్రకృతి ఒడిలో దేవకూట పర్వతంపై కొలువుదీరిన వీరేశ్వరస్వామి 1200 ఏళ్లకు పూర్వంనుంచే భక్తులచే పూజలందుకుంటున్నారు. పట్టిసీమ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాక, చారిత్రక పరంగానూ ఎంతో విశిష్టమైనది. సాధారణంగా ఏ రామాలయంలోనైనా సీతారామలక్ష్మణులు కలిసి కనిపిస్తారు. కానీ, ఇక్కడి దేవకూట పర్వతంపై లక్ష్మణుడు లేని సీతారాముల ఆలయం ఉండటం ఒక అరుదైన విశేషం. దక్షయజ్ఞ ధ్వంసం అనంతరం కోపోద్రిక్తుడైన వీరేశ్వరస్వామి తన ఆయుధమైన ‘పట్టిసం’ను ఇక్కడి గోదావరిలో కడిగినందున ఈ ప్రాంతానికి పట్టిసం అని పేరు వచ్చింది. అగస్త్య మహాముని తన బాహువులతో వీరేశ్వరుని బంధించి శాంతింపజేసిన గుర్తులు ఇప్పటికీ స్వామివారి విగ్రహంపై కనిపిస్తాయి. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. చారిత్రక కథనాల ప్రకారం, గతంలో ముస్లిం పాలకుల దండయాత్రల సమయంలో భద్రాచలంలోని సీతారాముల విగ్రహాలకు ముప్పు వాటిల్లింది. ఆ సమయంలో రామభక్తుడైన బాబాజీ ఆ విగ్రహాలను రక్షించడానికి సురక్షిత ప్రాంతమైన పట్టిసీమ దేవకూట పర్వతానికి తరలించారు. ఆ తర్వాత విగ్రహాలను తిరిగి భద్రాచలానికి తీసుకెళ్లినప్పటికీ, స్వామివారి కోరిక మేరకు బాబాజీ ఇక్కడ ప్రత్యేకంగా సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయంలో మూలవిరాట్టుగా కేవలం సీతారాములే కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. అయితే ఉత్సవ మూర్తులలో మాత్రం లక్ష్మణ, ఆంజనేయ స్వామివారు ఉంటారు. 18-19వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రక అంశాలు ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. భద్రాచలం మరియు పట్టిసం మధ్య ఉన్న ఈ ఆధ్యాత్మిక వారథి గురించి పరిశోధకులు మరిన్ని వివరాలు వెలికితీస్తే, ఈ క్షేత్ర మహిమ ప్రపంచవ్యాప్తం కాగలదని భక్తులు ఆశిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన

కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు.. డార్లింగ్ బ్యూటిఫుల్ రివ్యూ..

Trisha: తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం

Prabhas: షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌

Chiranjeevi: చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్

Follow Us