పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో ఇద్దరు వ్యక్తులు..

Updated on: May 07, 2026 | 7:02 PM

బీహార్‌లోని బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరక్కా ఎక్స్‌ప్రెస్ దూసుకువస్తుండగా, ప్లాట్‌ఫారమ్ దాటడానికి రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయవిదారక ఘటన సీసీటీవీలో రికార్డై వైరల్‌గా మారింది. అజాగ్రత్త వల్ల జరిగిన ఈ దుర్ఘటన రైల్వే భద్రత ఆవశ్యకతను, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల వాడకాన్ని గుర్తు చేస్తుంది.

బీహార్‌ రాజధాని పాట్నాలోని బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి మాల్దాకు వెళ్తున్న ఫరక్కా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం నంబర్ 1 మీదుగా దూసుకెళ్ళింది. అంతలో కొంతమంది పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. కొంత మంది వేగంగా ముందుకెళ్లిపోగా, ఇద్దరు మహిళలు బ్యాగులతో ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ వెనకబడిపోయారు. అంతే క్షణాల్లో వారు రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయారు. వారి తొందరపాటును గమనించిన ఇద్దరు ప్రయాణికులు సహాయానికి వచ్చారు కానీ వారిని పైకి లాగలేకపోయారు. ఒక వ్యక్తి మహిళల్లో ఒకరిని ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కించే ప్రయత్నంలో కింద పడిపోయాడు. మరొక వ్యక్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు వారిపై నుంచి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. దీంతో ప్లాట్‌ఫాంపైన ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అటు నుంచి శరవేగంగా దూసుకొస్తున్న రైలు. మరోవైపు పట్టాలు దాటుతున్న జనం. అంతే క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటిదాకా తమ చేయి పట్టుకున్న వారు, కళ్లముందే ఛిద్రం కావడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియా వైరల్‌ అవుతోంది. దీంతో స్టేషన్‌లో రైలు సేవలను కొద్దిసేపు నిలిపివేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా వెళ్లాలనే తొందరలో ప్లాట్‌ఫాం చేరుకోవడానికి పట్టాలు దాటే ప్రయత్నం చేయకండి. ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ను ఉపయోగించండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ గోడౌన్‌లో చోరీ.. భారీగా సిలిండర్లు మాయం..

అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!

మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..

Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు

Varanasi: సినిమా షూటింగ్ కోసం 150ట్యాంకర్ల డ్రింకింగ్ వాటరా..? జక్కన్నకు వాటర్ బోర్డ్ ఝలక్

Follow Us