బస్సు కోసం చూస్తుంటే.. లిఫ్ట్ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్ అమలు
బస్సు కోసం ఎదురుచూస్తున్న బంగారు వ్యాపారిని కారులో లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించిన కేటుగాళ్లు నిర్మానుష్య ప్రాంతంలో 40 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. తెలియని వారి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
పల్నాడు జిల్లాలో జరిగిన ఓ విచిత్ర దోపిడీ సంఘటన ప్రయాణికులను అప్రమత్తం చేసింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న బంగారు వ్యాపారిని లిఫ్ట్ ఇస్తామంటూ మోసగించిన ముఠా, నిర్మానుష్య ప్రదేశంలో ఆయన వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. నరసరావుపేటకు చెందిన అమిత్ అనే బంగారు వ్యాపారి నవంబర్ 6న గుంటూరులో బంగారు ఆభరణాలు చేయించుకుని, తిరిగి నరసరావుపేటకు వెళ్లేందుకు గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కారు డ్రైవర్, మరో ప్రయాణికుడు కలిసి అమిత్‌ను నరసరావుపేట వైపు లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. కారులో మరో ప్రయాణికుడు ఉండటంతో అది షేరింగ్ వాహనం అనుకొని అమిత్ ఎక్కాడు. వేమవరం క్రాస్ సమీపంలోకి రాగానే, కారు డ్రైవర్ మహంకాళి వాసు, అతని స్నేహితుడు అషీర్ అమిత్‌పై దాడి చేసి, ఆయన వద్ద ఉన్న బంగారాన్ని లాక్కుని పారిపోయారు. అమిత్ ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలియని వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పత్తి తీస్తున్న కూలీలు.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె ఆగినంత పనైంది
Sachin: సచిన్ స్పెషల్ మెసేజ్.. ధోనీకి భావోద్వేగ వీడ్కోలు!
PUC Rules 2026: కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి భారీ ఊరట!
రూ.9 కోట్ల మందు.. ఇప్పుడు రూ.2.5 లక్షలకే! ఈ డాక్టర్ నిజంగా దేవత..
మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి! ఇదో కొత్త సైబర్ దోపిడీ..
