పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
హర్యానాలో ఒక పానీపూరీ ఎక్కువ ఇవ్వలేదన్న చిన్న గొడవ ఏకంగా 12 ఏళ్లపాటు కోర్టు కేసుగా మారింది. దాడులు, ఎదురుకేసులు, పోలీసుల ప్రమేయంతో సాగిన ఈ వివాదంలో చివరకు సరైన ఆధారాలు లేవని కోర్టు తొమ్మిది మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని బాధితుల కుటుంబం ప్రకటించడంతో ఈ విచిత్ర కేసు మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఆస్తుల కోసం గొడవలు పడటం, మాటామాటా పెరగడం-కొట్టుకోవడం… అవి కోర్టులూ, జైళ్ల వరకూ వెళ్లడం తెలిసిందే. హరియాణాలోనూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ వాళ్లు పన్నెండేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. అయితే, ఈ గొడవ ఆస్తికోసమో, డబ్బుకోసమో జరగలేదు… ఒకే ఒక పానీపూరీ కోసం జరిగిందంటే నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇదే నిజం. 2013 మే 21వ తేదీ సాయంత్రం, హర్యానాలోని మహం పట్టణ రాజీవ్ చౌక్ వద్ద అనిల్ అనే యువకుడు సుబే సింగ్ అనే పానీపూరీ బండి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అందరూ ఐదు రూపాయలకు ఐదు పానీపూరీలు ఇస్తుంటే, నువ్వు నాలుగే ఎందుకు ఇస్తున్నావని అనిల్.. పానీపూరీ అమ్మేవాడిని నిలదీశాడు. అందుకతడు ‘నా వ్యాపారం… నా ఇష్టం. నచ్చితే తిను.. లేకుంటే వెళ్లిపో’ అని బదులిచ్చాడు. దీంతో ఈ వివాదం ముదిరి గొడవగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగాయి. ఈ ఘటనపై అనిల్, అతని స్నేహితులపై దాడి కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదట మహం కోర్టు అనిల్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అనిల్ తరఫున అతని తండ్రి సత్యవాన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, అక్కడ అనిల్ నిర్దోషిగా విడుదలయ్యాడు. అదే సమయంలో, తన కుమారుడిపై బండి నిర్వాహకులతో పాటు అప్పటి ఎస్.హెచ్.ఓ, చౌకీ ఇన్‌చార్జ్, ఏఎస్ఐలు కలిసి దాడి చేశారంటూ సత్యవాన్ ఎదురు కేసు వేశారు. దీంతో సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం రెండు కేసులను ఏకకాలంలో విచారించడం ప్రారంభించారు. ఈ 12 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ముగ్గురు పోలీసు అధికారులు పదవీ విరమణ లేదా బదిలీ అయ్యారు. కోర్టు మొత్తం 15 మంది సాక్షులను విచారించింది. చివరకు, ఇరుపక్షాల వద్ద సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో తొమ్మిది మంది నిందితులనూ నిర్దోషులుగా విడుదల చేస్తూ మహం కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పుపై తాము హైకోర్టుకు వెళ్తామని అనిల్ తండ్రి స్పష్టం చేయడంతో, ఈ పానీపూరీ కథ ఇంకా ముగియనట్లే కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
Amarnath Ice Lingam: అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు
ఏంటి? పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?
V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం
